Lokah 23 days Collections: చరిత్ర సృష్టించిన లోక.. మలయాళ ఇండస్ట్రీలో కలెక్షన్ల సంచలనం.. ఎన్ని కోట్లంటే?
మలయాళ సినిమా పరిశ్రమలో లోక చాప్టర్ 1: చంద్ర సంచలనం విజయం సాధించింది. ఓనమ్ పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లోక చాప్టర్ 1 చంద్ర. ఈ చిత్రంలో ప్రేమలు హీరో నస్లేన్, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటించారు. కూలీ ఫేమ్ షౌబీన్, స్టార్ హీరో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి సినిమాటోగ్రఫి, చమన్ ఛాక్కో సినిమాటోగ్రఫిని అందించారు.
ఓనమ్ పండుగ సందర్భంగా ఈ సినిమా 28 ఆగస్టున రిలీజ్ అయింది. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కాస్ట్‌తో కలిపి ఈ మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా 50 కోట్ల రూపాయలు షేర్ వసూళ్ల లక్ష్యంగా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. అయితే ఈ సినిమా తొలి ఆట నుంచే హిట్ టాక్‌తో రికార్డు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది.

లోక చిత్రం తొలివారం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మలయాళంలో 39 కోట్ల రూపాయలు, తెలుగులో 8 కోట్ల రూపాయలు, కన్నడలో 6.5 కోట్ల రూపాయలు, తమిళంలో 9 కోట్ల రూపాయలు, హిందీలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 65.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక రెండో వారంలో కూడా ఈ సినిమా కూడా ఈ చిత్రం సత్తా చాటింది. మలయాళంలో 36 కోట్లు, తెలుగులో 5.5 కోట్లు, తమిళంలో 6 కోట్లు, కన్నడలో 4 కోట్లు, హిందీలో 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా రెండో వారంలో 55.5 కోట్లు వసూలు చేసింది. రెండు వారాల్లో కలిపి 121 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
లోక చిత్రం రెండు వారాల్లో సాలిడ్ కలెక్షన్లు రాబట్టిన అనంతరం మూడో వారంలో అదే జోరును కొనసాగించింది. ఈ చిత్రం మలయాళంలో 21.5 కోట్ల రూపాయలు, తమిళంలో 5 కోట్ల రూపాయలు, తెలుగులో 1.5 కోట్ల రూపాయలు, కన్నడలో 2.5 కోట్ల రూపాయలు, హిందీలో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 32.5 కోట్ల రూపాయలు మూడో వారంలో రాబట్టింది. దాంతో ఈ చిత్రం మూడు వారాల్లో 153.5 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది.
లోక చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రానికి పలు దేశాల్లో రికార్డు వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ చిత్రం నార్త్ అమెరికా, యూకే, గల్ఫ్, ఇతర దేశాల్లో కలిపి మొత్తం 112 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 265.5 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఇప్పటి వరకు ఎంపురాన్ పేరిట ఉన్న 265 కోట్ల రూపాయల రికార్డును అధిగమించింది.


Click it and Unblock the Notifications











