Lokah Day 1 Collections: డీసెంట్‌గా లోక బాక్సాఫీస్ కలెక్షన్లు.. దుల్కర్ సల్మాన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లోక చాప్టర్ 1 చంద్ర. ఈ చిత్రంలో ప్రేమలు హీరో నస్లేన్, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటిస్తున్నారు. కూలీ ఫేమ్ షౌబీన్, స్టార్ హీరో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. ఇంకా ఈ చిత్రంలో నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు నటిస్తున్నారు.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి సినిమాటోగ్రఫి, చమన్ ఛాక్కో సినిమాటోగ్రఫిని అందించారు. ఓనమ్ పండుగ సందర్భంగా ఈ సినిమా 28 ఆగస్టున రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

తెలుగులో కొత్త లోక టైటిల్‌తో విడుదలైన మలయాళ సినిమాను సూపర్ హీరోయిన్ కాన్సెప్ట్‌తో రక్త పిశాచాల బ్యాక్ డ్రాప్‌తో ఇంటెన్స్ రూరల్, అర్బన్ డ్రామాగా రూపొందించారు. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ భారీగా ఉపయోగించారు. దాంతో ఈ సినిమా నిర్మాణ వ్యయం కూడా ఎక్కువగానే అయింది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కాస్ట్‌తో కలిపి ఈ మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు భారీగా స్పందన లభించింది. దాంతో తొలి సూపర్ ఉమెన్ కథగా రావడంతో అంచనాలు కూడా పెరిగాయి. దాంతో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూను కూడా భారీగానే అంచనా కట్టారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 50 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
భారీ అంచనాలతో థియేటర్‌లోకి వచ్చిన లోక మూవీ ఉదయం, మధ్యాహ్నం ఆటలకు అంత గొప్పగా ఆక్యుపెన్సీ కనిపించలేదు. కానీ సాయంత్రం, రాత్రి షోలు పుంజుకొన్నాయి. ఈ సినిమా ఈవెనింగ్ షోలకు 50 శాతం ఆక్యుపెన్సీ, నైట్ షోలకు 70 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. కోచీ, కొల్లాంలో అత్యధికంగా 65 శాతం, కోజికోడ్‌లో 55 శాతం, హైదరాబాద్‌లో 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
ఇక ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కేరళ బాక్సాఫీస్ వద్ద ఘనంగా జర్నీని ప్రారంభించింది. కేరళలో ఈ సినిమా ఫస్ట్ డే 3 కోట్ల రూపాయలు, కన్నడలో 30 లక్షలు, తమిళనాడులో 30 లక్షలు, తెలుగులో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా వసూళ్లు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమా తొలిరోజు సుమారుగా 4 కోట్ల రూపాయల గ్రాస్ ఇండియాలో, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు (అంచనా) వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











