Lokha Day 11 Box Office: లోక రికార్డుల సంచలనం.. ఇండస్ట్రీ హిట్‌తో కల్యాణి, దుల్కర్ సెన్సేషన్

బాక్సాఫీస్ వద్ద మలయాళ చిత్రం లోక చాప్టర్ 1: చంద్ర దుమ్ములేపుతోంది. మీడియం రేంజ్ బడ్జెట్ తో రూపుదిద్దుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌లు హీరోయిన్‌లుగా నటించారు. కూలీ ఫేమ్ షౌబీన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్స్ లో నటించారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి, చమన్ చాకోలు సినిమాటోగ్రఫిని అందించారు. ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 11వ రోజు ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనే వివరాల్లోకి వెళితే..

లోక : చాప్టర్ 1 చంద్ర బడ్జెట్ ఎంత?
మలయాళం చిత్రం లోక చాప్టర్ 1 చంద్రలో మలయాళంలోని ప్రముఖ నటులు నటించడం విశేషం, టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేశారు. ఈ సందర్భంగా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, చిత్ర నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాల ఖర్చులను కలుపుకొని రూ.65 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

Lokah Chapter 1 Chandra Day 11 Box Office Collections Worldwide

లోక : చాప్టర్ 1 చంద్ర ప్రీ రిలీజ్ బిజినెస్?
లోక : చాప్టర్ 1 చంద్ర సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే అయ్యింది. చిత్రానికి దుల్కర్ సల్మాన్ నిర్మాత కావడం, సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ కావడం, అందుకు తగ్గట్టుగా సినిమాను ప్రమోట్ చేయడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది. దీంతో అన్ని భాషల పుంచి రూ.25 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందని తెలిసింది. కాగా థియేట్రికల్ రైట్స్ ద్వారా రూ.50 కోట్లు గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

లోక చాప్టర్ 1 చంద్ర 10 రోజుల వసూళ్లు..
ఓపెనింగ్ రోజు రూ.3 కోట్లు, 2వ రోజు రూ.4 కోట్లు, 3వ రోజు రూ.8 కోట్లు, 4వ రోజు రూ.10 కోట్లు, 5వ రోజు రూ.7.2 కోట్లు, 6వ రోజు రూ.8 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.8.35 కోట్లు, 9వ రోజు రూ.8 కోట్లు, 10వ రోజు రూ.10 కోట్లు ఇండియా గ్రాస్ వసూలైందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక తెలుగులో రూ.10 కోట్లు, తమిళంలో రూ.6.5 కోట్లు, మలయాళంలో రూ.56 కోట్లు, హిందీలో రూ.1 కోటి వసూల్ చేసింది. 10 రోజుల్లో ఇండియా నెట్ రూ.73 కోట్లకు చేరుకోవడం విశేషం.

11వ రోజు కలెక్షన్స్..
లోకా : చాప్టర్ 1 చంద్ర ఆదివారం మంచి వసూళ్లను అందుకుంది. మలయాళంలో రూ.7.5 కోట్లు, తమిళంలో రూ.1 కోటీ, తెలుగులో రూ.1.50 కోట్లు, హిందీలో 1.50 కోట్ల నెట్ వసూల్ చేసింది. దీంతో కేవలం 11వ రోజుతో ఇండియా నెట్ టోటల్ గా రూ.83 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఇక ఇండియా గ్రాస్ రూ.86 కోట్లు, ఓవర్సీస్ లో రూ.84 కోట్లు వసూళైంది. దీంతో వరల్డ్ వైడ్ గా 11వ రోజు వరకు బాక్సాఫీస్ వద్ద రూ.170 కోట్ల గ్రాస్ వసూలైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో రికార్డు..
2025లో విడుదైన మలయాళం చిత్రాలన్నింటి కంటే లోకా : చాప్టర్ 1 చంద్ర ఓవర్సీస్ లో కలెక్షన్స్ పరంగా టాప్ లో నిలిచింది. మలయాళ పరిశ్రమకు విదేశాల్లో 10 మిలియన్ వసూళ్లు సాధించిన ఒక్క సినిమా కూడా లేదు. కానీ ఏడాది ఎల్2 ఎంపురాన్, తుడురమ్, ఇప్పుడు లోకా ఆ జాబితాలో చేరింది. అలాగే మాలీవుడ్‌లో ఆల్-టైమ్ 4వ అల్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రికార్డు క్రియేట్ చేసింది. కేవలం కేరళలోనే రూ.60 కోట్లకు దగ్గరగా వసూళ్లు ఉండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X