Lokah Day 14 Collections: లోక చాప్టర్ 1 వసూళ్ల విధ్వంసం.. 2 వారాల్లో ఎంత రాబట్టిందంటే?
డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌లు నటించిన మూవీ లోక చాప్టర్ 1: చంద్ర. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మాతగా మార్చి ఈ చిత్రాన్ని నిర్మించారు. లోక చాప్టర్ 1: చంద్రలో షౌబీన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి, చమన్ చాకోలు సినిమాటోగ్రఫిని అందించారు. ఆగస్ట్ 28న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో లోక చాప్టర్ 1: చంద్ర మూవీ బడ్జెట్ ఎంత? థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 14వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వివరాలు పరిశీలిస్తే..
లోక చాప్టర్ 1 చంద్ర బడ్జెట్
లోక చాప్టర్ 1 చంద్ర సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి లోక చాప్టర్ 1 చంద్ర మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. లోక చాప్టర్ 1 చంద్ర మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 50 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.

లోక చాప్టర్ 1 చంద్ర 13 రోజుల వసూళ్లు
లోక చాప్టర్ 1 తొలిరోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు, మూడో రోజున 8 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11 కోట్ల రూపాయలు, ఐదో రోజున 8 కోట్ల రూపాయలు, ఆరో రోజున 8 కోట్ల రూపాయలు, ఏడో రోజున 8 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 9 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 8 కోట్ల రూపాయలు, పదవ రోజున 11 రూపాయలు, పదకొండో రోజున 11 రూపాయలు, పన్నెండవ రోజున 6.50 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 6 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. దాంతో ఇండియాలో 13 రోజుల వరకు 98 కోట్ల రూపాయల నెట్, 110 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అటు ఓవర్సీస్‌లోనూ లోక చాప్టర్ 1 చంద్ర సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో కళ్యాణి ప్రియదర్శన్ మూవీకి 95 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో కలిపి ఈ సినిమా 13 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 205 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 చంద్ర సినిమాకు తొలి రోజున 50 లక్షల రూపాయలు, రెండో రోజున 1.20 కోట్లు, మూడో రోజున 2 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 2 కోట్ల రూపాయలు , ఐదో రోజున కోటి రూపాయలు, ఆరో రోజున 1.30 కోట్ల రూపాయలు, ఐదో రోజున కోటి రూపాయలు, ఆరో రోజున 1.10 కోట్ల రూపాయలు, ఏడో రోజున కోటి రూపాయలు, 8వ రోజున 1.20 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున కోటి రూపాయలు, పదో రోజున 1.50 కోట్లు, పదకొండో రోజున 1.30 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 50 లక్షల రూపాయలు, పదమూడో రోజున 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలోని పలు రాష్ట్రాలలో లోక చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. మలయాళంలో 77 కోట్ల రూపాయలు, తమిళంలో 9 కోట్ల రూపాయలు, తెలుగులో 13 కోట్ల రూపాయలు, కన్నడంలో 6 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
లోక చాప్టర్ 1 పద్నాగవ రోజు కలెక్షన్స్
వీకెండ్ ముగిసినప్పటికీ వర్కింగ్ డేస్‌లోనూ దుల్కర్ సల్మాన్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 14వ రోజున మలయాళం వెర్షన్‌లో 42 శాతం, తెలుగు వెర్షన్‌లో 17 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. 14వ రోజున మలయాళంలో 3.50 కోట్ల రూపాయలు, తమిళంలో 40 లక్షల రూపాయలు, తెలుగులో 50 లక్షల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 30 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. దాంతో 10 రోజుల వరకు లోక చాప్టర్ 1: చంద్ర వరల్డ్ వైడ్‌గా 211 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి 250 కోట్ల మార్క్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ వారం తెలుగులో మిరాయి మూవీ రానుండటంతో లోక చాప్టర్ 1పై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











