Lokah Day 16 Collections: 250 కోట్లకు చేరువగా లోక .. రికార్డ్ వసూళ్లతో దుల్కర్ మూవీ విధ్వంసం
డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌లు నటించిన చిత్రం లోక చాప్టర్ 1: చంద్ర. ఆగస్ట్ 28న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించారు. షౌబీన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్‌లు గెస్ట్ రోల్స్‌లో అలరించారు. నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి, చమన్ చాకోలు సినిమాటోగ్రఫిని అందించారు. ఈ నేపథ్యంలో లోక చాప్టర్ 1: చంద్ర మూవీ బడ్జెట్ ఎంత? థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 16వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వివరాలు పరిశీలిస్తే..
లోక చాప్టర్ 1 చంద్ర బడ్జెట్
లోక చాప్టర్ 1 చంద్ర సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి లోక చాప్టర్ 1 చంద్ర మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. లోక చాప్టర్ 1 చంద్ర మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 50 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.

లోక చాప్టర్ 1 చంద్ర 16 రోజుల వసూళ్లు
లోక చాప్టర్ 1 తొలిరోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు, మూడో రోజున 8 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11 కోట్ల రూపాయలు, ఐదో రోజున 8 కోట్ల రూపాయలు, ఆరో రోజున 8 కోట్ల రూపాయలు, ఏడో రోజున 8 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 9 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 8 కోట్ల రూపాయలు, పదవ రోజున 11 రూపాయలు, పదకొండో రోజున 11 రూపాయలు, పన్నెండవ రోజున 6.50 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 6 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 5 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 4 కోట్ల రూపాయలు, పదహారవ రోజున 7 కోట్ల రూపాయల చొప్పున కలెక్షన్స్ రాబట్టింది. దాంతో ఇండియాలో 16 రోజుల వరకు 113 కోట్ల రూపాయల నెట్, 124 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.
అటు ఓవర్సీస్‌లో 100 కోట్ల వసూళ్లు రాబట్టిన రెండో మలయాళ చిత్రంగా లోక చాప్టర్ 1 నిలిచన సంగతి తెలిసిందే. రెండు వారాలు గడుస్తున్నా ఈ సినిమాకు ఫారిన్‌లో ఊపు తగ్గడం లేదు. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు దుల్కర్ సల్మాన్ మూవీకి 102 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో కలిపి లోక చాప్టర్ 1: చంద్ర మూవీకి 16 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా 224 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 చంద్ర సినిమాకు తొలి రోజున 50 లక్షల రూపాయలు, రెండో రోజున 1.20 కోట్లు, మూడో రోజున 2 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 2 కోట్ల రూపాయలు , ఐదో రోజున కోటి రూపాయలు, ఆరో రోజున 1.30 కోట్ల రూపాయలు, ఐదో రోజున కోటి రూపాయలు, ఆరో రోజున 1.10 కోట్ల రూపాయలు, ఏడో రోజున కోటి రూపాయలు, 8వ రోజున 1.20 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున కోటి రూపాయలు, పదో రోజున 1.50 కోట్లు, పదకొండో రోజున 1.30 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 50 లక్షల రూపాయలు, పదమూడో రోజున 50 లక్షల రూపాయలు, పద్నాలుగో రోజున 50 లక్షల రూపాయలు, పదిహేనవ రోజున 40 లక్షల రూపాయలు, పదహారవ రోజున 30 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలోని పలు రాష్ట్రాలలో లోక చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. మలయాళంలో 87 కోట్ల రూపాయలు, తమిళంలో 11 కోట్ల రూపాయలు, తెలుగులో 14.50 కోట్ల రూపాయలు, కన్నడంలో 8 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 8 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
లోక చాప్టర్ 1 పదిహేడవ రోజు రోజు కలెక్షన్స్
శనివారం వీకెండ్ కావడంతో లోక చాప్టర్ 1: చంద్ర మూవీకి భారీగా బుకింగ్స్ జరిగాయి. 17వ రోజున మలయాళం వెర్షన్‌లో 67 శాతం, తెలుగు వెర్షన్‌లో 29 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. 17వ రోజున మలయాళంలో 5.50 కోట్ల రూపాయలు, తమిళంలో 80 లక్షల రూపాయలు, తెలుగులో 30 లక్షల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 35 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 1.50 కోట్ల రూపాయలు చొప్పున ప్రపంచవ్యాప్తంగా 8.50 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. దాంతో 16 రోజుల వరకు లోక చాప్టర్ 1: చంద్ర చిత్రం వరల్డ్ వైడ్‌గా 234 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తద్వారా ఎల్ 2 ఎంపురాన్, మంజుమల్ బాయ్స్, తుడరం మూవీల తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన నాలుగవ మలయాళ చిత్రంగా లోక చాప్టర్ 1 చిత్రం నిలిచింది.


Click it and Unblock the Notifications











