Lokah Day 19 Collections: లోక వసూళ్ల జాతర.. నెంబర్ వన్ ప్లేస్‌పై కన్ను, దుల్కర్ మూవీకి ఎన్ని కోట్లంటే?

విడుదలైన నాటి నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, ఒక్కో సినిమా రికార్డును బద్ధలు కొడుతూ వస్తోంది లోక చాప్టర్ 1: చంద్ర. ఇండియాతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది లోక. ఇప్పటికే మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ నటించి ఎల్ 2: ఎంపురాన్ మూవీ రికార్డును ఈ సినిమా బద్ధలు కొట్టింది. దీంతో లాంగ్ రన్‌లో లోక ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందోనని మలయాళ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తోంది.

లోక చాప్టర్ 1: చంద్ర చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా.. కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌లు లీడ్ రోల్స్ పోషించారు. సూపర్ ఉమెన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమానుమలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ స్వయంగా నిర్మించారు. షౌబీన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్‌లు అతిథి పాత్రలో కనిపించారు. నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి, చమన్ చాకోలు సినిమాటోగ్రఫిని అందించారు. ఈ నేపథ్యంలో లోక చాప్టర్ 1: చంద్ర మూవీ బడ్జెట్ ఎంత? థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 19వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వివరాలు పరిశీలిస్తే..

Lokah Chapter 1 Chandra Day 19 Box Office Collections Worldwide Dulquer Salman s movie eye on L2 Empuraan Record

లోక చాప్టర్ 1 చంద్ర బడ్జెట్
లోక చాప్టర్ 1 చంద్ర సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి లోక చాప్టర్ 1 చంద్ర మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. భారీ అంచనాల నేపథ్యంలో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. లోక చాప్టర్ 1 చంద్ర మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 50 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.

లోక చాప్టర్ 1 చంద్ర 18 రోజుల వసూళ్లు
లోక చాప్టర్ 1 తొలిరోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు, మూడో రోజున 8 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11 కోట్ల రూపాయలు, ఐదో రోజున 8 కోట్ల రూపాయలు, ఆరో రోజున 8 కోట్ల రూపాయలు, ఏడో రోజున 8 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 9 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున 8 కోట్ల రూపాయలు, పదవ రోజున 11 రూపాయలు, పదకొండో రోజున 11 రూపాయలు, పన్నెండవ రోజున 6.50 కోట్ల రూపాయలు, పదమూడో రోజున 6 కోట్ల రూపాయలు, పద్నాలుగో రోజున 5 కోట్ల రూపాయలు, పదిహేనవ రోజున 4 కోట్ల రూపాయలు, పదహారవ రోజున 5 కోట్ల రూపాయలు, పదిహేడవ రోజున 7 కోట్ల రూపాయలు, పద్దెనివమిదవ రోజున 7.50 కోట్ల రూపాయలు చొప్పున కలెక్షన్స్ రాబట్టింది. దాంతో ఇండియాలో 18 రోజుల వరకు 123 కోట్ల రూపాయల నెట్, 140 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

అటు ఓవర్సీస్‌లో అయితే దుల్కర్ మూవీకి ఎదురు లేకుండా సాగుతోంది. ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లు సాధించడం వెనుక ఓవర్సీస్ మార్కెట్ కీలకపాత్ర పోషించింది. నార్త్ అమెరికా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలతో కలిపి ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు లోక చాప్టర్ 1: చంద్ర చిత్రం 110 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబ్టటింది. ఇండియాలో వచ్చిన గ్రాస్ ప్లస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి కళ్యాణి ప్రియదర్శన్ మూవీకి 18 రోజుల వరకు 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 చంద్ర సినిమాకు తొలి రోజున 50 లక్షల రూపాయలు, రెండో రోజున 1.20 కోట్లు, మూడో రోజున 2 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 2 కోట్ల రూపాయలు , ఐదో రోజున కోటి రూపాయలు, ఆరో రోజున 1.30 కోట్ల రూపాయలు, ఐదో రోజున కోటి రూపాయలు, ఆరో రోజున 1.10 కోట్ల రూపాయలు, ఏడో రోజున కోటి రూపాయలు, 8వ రోజున 1.20 కోట్ల రూపాయలు, తొమ్మిదవ రోజున కోటి రూపాయలు, పదో రోజున 1.50 కోట్లు, పదకొండో రోజున 1.30 కోట్ల రూపాయలు, పన్నెండో రోజున 50 లక్షల రూపాయలు, పదమూడో రోజున 50 లక్షల రూపాయలు, పద్నాలుగో రోజున 50 లక్షల రూపాయలు, పదిహేనవ రోజున 40 లక్షల రూపాయలు, పదహారవ రోజున 30 లక్షల రూపాయలు, పదిహేడవ రోజున 40 లక్షల రూపాయలు, పద్దెనిమిదవ రోజున 40 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలోని పలు రాష్ట్రాలలో లోక చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. మలయాళంలో 95 కోట్ల రూపాయలు, తమిళంలో 14 కోట్ల రూపాయలు, తెలుగులో 16 కోట్ల రూపాయలు, కన్నడంలో 8 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 10 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.

లోక 19వ రోజు రోజు కలెక్షన్స్
వీకెండ్ వరకు వసూళ్ల ఊచకోత కోసిన ఈ చిత్రం సోమవారం కాస్త డౌన్ అయ్యింది. 19వ రోజు ఈ మూవీకి మలయాళంలో 33 శాతం, తెలుగులో 16 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. 19వ రోజు లోక చాప్టర్ 1: చంద్ర మూవీ 4 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. దాంతో వరల్డ్ వైడ్‌గా 19 రోజుల వరకు దుల్కర్ సల్మాన్ మూవీ 254 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. మాస్ వసూళ్లతో మోహన్ లాల్ తుడరం (237.76 కోట్లు), మంజుమల్ బాయ్స్ ( 241.56 కోట్లు) రికార్డులను బద్ధలు కొట్టిన లోక చిత్రం.. అత్యథిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాల్లో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఇదే ఊపులో కొనసాగితే.. మోహన్ లాల్- పృథ్వీరాజ్ సుకుమారన్‌ల ఎల్ 2: ఎంపురాన్ (268.05 కోట్లు) కలెక్షన్ల రికార్డును బ్రేక్ చేసేందుకు మరో 15 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X