Lokah Day 2 Collections: పుంజుకున్న లోక చాప్టర్ 1 కలెక్షన్స్.. దుల్కర్ సల్మాన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

వరుస సినిమాలతో ఊపుమీదున్నారు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నారు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. తాజాగా దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం లోక చాప్టర్ 1 చంద్ర. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ వివరాలు పరిశీలిస్తే..

లోక చాప్టర్ 1 చంద్ర క్యాస్టింగ్
లోక చాప్టర్ 1 చంద్ర సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌లు హీరోయిన్‌లుగా నటించారు. కూలీ ఫేమ్ షౌబీన్, స్టార్ హీరో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి, చమన్ చాకోలు సినిమాటోగ్రఫిని అందించారు.

Lokah Chapter 1 Chandra Day 2 Box Office Collections Worldwide Dulquer Salman s movie gets good number

లోక చాప్టర్ 1 చంద్ర బడ్జెట్ ఎంత?
హార్రర్, సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు నిర్మాత దుల్కర్ సల్మాన్. ఖర్చుకు వెనకడుగు వేయకుండా నిర్మించారు. కేరళలోని అందమైన లోకేషన్స్‌లో లోక చాప్టర్ 1 సినిమా షూటింగ్ నిర్వహించారు. హార్రర్ అనుభూతిని పంచేందుకు గాను అధునాతన డీటీఎస్, వీఎఫ్ఎక్స్ టెక్నాలజీకి భారీగా ఖర్చుపెట్టారు. దాంతో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి లోక చాప్టర్ 1 చంద్ర మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు.

లోక చాప్టర్ 1 చంద్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్
మలయాళ చిత్ర పరిశ్రమలో హార్రర్, సస్పెన్స్ జోనర్స్‌కు ప్రేక్షకుల నుంచి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎన్ని సినిమాలు వచ్చినా కొత్త వాటిని ప్రేక్షకులు ఆదరించి వాటిని బ్లాక్‌బస్టర్లుగా చేస్తున్నారు. దీనికి తోడు సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ కావడంతో లోక చాప్టర్ 1 చంద్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 50 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.

లోక చాప్టర్ 1 చంద్ర 2 రోజుల వసూళ్లు
50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లక్ష్యంగా బరిలోకి దిగిన లోక చాప్టర్ 1 చంద్ర సినిమా తొలి రోజు అంతగా కలెక్షన్స్‌ను రాబట్టలేదు. తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 3.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. మౌత్ టాక్ కారణంగా రెండో రోజు మాత్రం లోక చాప్టర్ 1కు చెప్పుకోదగ్గ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. మలయాళంకు తోడు తెలుగు వెర్షన్‌లోనూ ఆదరణ దక్కుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. 2వ రోజు లోక చాప్టర్ 1కు మలయాళ వెర్షన్‌లో 61 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. మొత్తంగా 2వ రోజు ఈ సినిమా కలెక్షన్స్ పరిశీలిస్తే.. మలయాళంలో 4 కోట్ల రూపాయలు, తెలుగులో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు, తమిళనాడు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల చొప్పున వరల్డ్ వైడ్‌గా 5.50 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో 2 రోజుల వరకు లోక చాప్టర్ 1 చంద్ర సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు ఆర్జించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X