Lokah Day 3 Collections:లోక చాప్టర్ 1 వసూళ్ల ఊచకోత.. దుల్కర్ సల్మాన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

మలయాళ చిత్రాలు సైలెంట్ కిల్లర్స్ అని రుజువు చేసుకుంటూ ఉంటాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా భారీ వసూళ్లు సాధించడంలో ఈ సినిమాల శైలే వేరు. తాజాగా వచ్చిన లోక చాప్టర్ 1 : చంద్ర చిత్రం కూడా అంచనాలను మించి భారీ వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి లోక చాప్టర్ 1 : చంద్ర సినిమాను నిర్మించారు. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడవ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వివరాలు పరిశీలిస్తే..

లోక చాప్టర్ 1 చంద్ర బడ్జెట్
లోక చాప్టర్ 1 చంద్ర సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌లు హీరోయిన్‌లుగా నటించారు. కూలీ ఫేమ్ షౌబీన్, స్టార్ హీరో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి, చమన్ చాకోలు సినిమాటోగ్రఫిని అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి లోక చాప్టర్ 1 చంద్ర మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Lokah Chapter 1 Chandra Day 3 Box Office Collections Worldwide Dulquer Salman s movie good growth at GBOC

లోక చాప్టర్ 1 చంద్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్
దుల్కర్ సల్మాన్ నిర్మాత కావడం, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, ఉమెన్ కాన్సెప్ట్ కావడంతో లోక చాప్టర్ 1 చంద్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 50 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.

లోక చాప్టర్ 1 చంద్ర 2 రోజుల వసూళ్లు
తొలి రోజు వరల్డ్ వైడ్‌గా 3.50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. తొలి రోజు కొన్ని కారణాలతో కేరళలో తప్పించి ఎక్కడా సినిమా రిలీజ్ కాలేదు. తెలుగులోనూ ఆలస్యమైంది. దీని ప్రభావం సినిమా వసూళ్లపై పడింది. లోక చాప్టర్ 1 తొలిరోజు కేవలం 3.50 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. రెండో రోజు తెలుగు మార్కెట్ కూడా కలిసి రావడంతో వసూళ్లు ఊపందుకున్నాయి. రెండో రోజు 5.50 కోట్ల కలెక్షన్స్ అందుకుంది ఈ సినిమా. అటు ఓవర్సీస్‌లోనూ లోక చాప్టర్ 1 చంద్ర సినిమా దుమ్మురేపుతోంది. నార్త్ అమెరికా, యూకే, గల్ఫ్ దేశాలలో కలిపి ఈ సినిమాకు ఏకంగా 11 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో రెండో రోజుల వరకు 9 కోట్ల రూపాయల

మౌత్ టాక్ కారణంగా రెండో రోజు మాత్రం లోక చాప్టర్ 1కు చెప్పుకోదగ్గ స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. మలయాళంకు తోడు తెలుగు వెర్షన్‌లోనూ ఆదరణ దక్కుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. 2వ రోజు లోక చాప్టర్ 1కు మలయాళ వెర్షన్‌లో 61 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. మొత్తంగా 2వ రోజు ఈ సినిమా కలెక్షన్స్ పరిశీలిస్తే.. మలయాళంలో 4 కోట్ల రూపాయలు, తెలుగులో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు, తమిళనాడు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల చొప్పున వరల్డ్ వైడ్‌గా 5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో 2 రోజుల వరకు లోక చాప్టర్ 1 చంద్ర సినిమా ఇండియాలో 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు ఆర్జించింది. ఓవర్సీస్ వసూళ్లు కలిపి దుల్కర్ సల్మాన్ సినిమా రెండు రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 20 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది.

లోక చాప్టర్ 1 చంద్ర 3 రోజుల వసూళ్లు
మూడో రోజు లోక చాప్టర్ 1 చంద్ర కలెక్షన్ల వర్షం కురిపించింది. మలయాళంలో 74 శాతం, తెలుగులో 30 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌‌నిక్ తెలిపింది. వీకెండ్ కావడంతో పాటు సూపర్ ఉమెన్స్ కాన్సెప్ట్ కారణంగా కుటుంబ ప్రేక్షకుల ఆదరణ దక్కింది. మూడో రోజు లోక చాప్టర్ 1 సినిమాకు మలయాళంలో 6.25 కోట్ల రూపాయలు, తమిళంలో 50 లక్షలు, తెలుగులో 1.50 లక్షలు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల చొప్పున 8.75 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో కలిపి లోక చాప్టర్ 1 చంద్ర 3 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 28 కోట్ల రూపాయలు గ్రాస్ రాబట్టి 50 కోట్ల మార్క్ దిశగా అడుగులు వేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X