Lokah Day 4 Collections: లోక కలెక్షన్ల సంచలనం.. 100 కోట్ల దిశగా దుల్కర్ మూవీ.. 4 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లోక చాప్టర్ 1 చంద్ర. ఈ చిత్రంలో ప్రేమలు హీరో నస్లేన్, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటిస్తున్నారు. కూలీ ఫేమ్ షౌబీన్, స్టార్ హీరో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. ఇంకా ఈ చిత్రంలో నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు నటించారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి సినిమాటోగ్రఫి, చమన్ ఛాక్కో సినిమాటోగ్రఫిని అందించారు. ఓనమ్ పండుగ సందర్భంగా ఈ సినిమా 28 ఆగస్టున రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

తెలుగులో కొత్త లోక టైటిల్‌తో విడుదలైన మలయాళ సినిమాను సూపర్ హీరోయిన్ కాన్సెప్ట్‌తో రక్త పిశాచాల బ్యాక్ డ్రాప్‌తో ఇంటెన్స్ రూరల్, అర్బన్ డ్రామాగా రూపొందించారు. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ భారీగా ఉపయోగించారు. దాంతో ఈ సినిమా నిర్మాణ వ్యయం కూడా ఎక్కువగానే అయింది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కాస్ట్‌తో కలిపి ఈ మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 50 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Lokah Chapter 1 Chandra

లోక సినిమా రిలీజ్ తర్వాత తొలి ఆట నుంచే ఫుల్లుగా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల బెటర్ ఆక్యుపెన్సీతో భారీ వసూళ్లను సాధిస్తున్నది. తొలి రోజు కంటే ఆ తర్వాత రోజుల్లో ఊహకు అందని విధంగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

మలయాళం బాక్సాఫీస్ వద్ద లోక చిత్రం తొలి రోజు 2.7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు భారీ జంప్ కొట్టి 4 కోట్ల రూపాయలు, మూడో రోజు 7.6 కోట్లు, నాలుగో రోజు 10 కోట్ల రూపాయలు రాబట్టింది. తెలుగులో ఈ సినిమా మొదటి రోజు లేటుగా షోలు ప్రారంభమైనప్పటికీ.. 50 లక్షల రూపాయలు, రెండో రోజు 1.2 కోట్లు, మూడో రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది.

లోక చిత్రం వివిధ భాషల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఈ సినిమా దాదాపు 20 కోట్లకుపైగా కలెక్షన్లు, కన్నడలో 1.8 కోట్లు, తెలుగులో 4 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.75 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ చిత్రం సుమారుగా 30 కోట్ల నెట్ వసూళ్లను, 40 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 25 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 4 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 55 కోట్ల నెట్, 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X