Lokah Day 5 Collections: లోకకు రికార్డ్ వసూళ్లు.. 5వ రోజు దుల్కర్ సల్మాన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం లోక చాప్టర్ 1: చంద్ర. పేరుతోనే ఆకట్టుకున్న ఈ సినిమా సూపర్ కాన్సెప్ట్ ఉమెన్ ఇతివృత్తంతో తెరకెక్కి పిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తోంది. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడవ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వివరాలు పరిశీలిస్తే..

లోక చాప్టర్ 1 చంద్ర బడ్జెట్
లోక చాప్టర్ 1 చంద్ర సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌లు హీరోయిన్‌లుగా నటించారు. కూలీ ఫేమ్ షౌబీన్, స్టార్ హీరో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి, చమన్ చాకోలు సినిమాటోగ్రఫిని అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి లోక చాప్టర్ 1 చంద్ర మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Lokah Chapter 1 Chandra Day 5 Box Office Collections Worldwide Dulquer Salman s movie raked in a solid total at GBOC

లోక చాప్టర్ 1 చంద్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్
దుల్కర్ సల్మాన్ నిర్మాత కావడం, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, ఉమెన్ కాన్సెప్ట్ కావడంతో లోక చాప్టర్ 1 చంద్రపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 50 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.

లోక చాప్టర్ 1 చంద్ర 4 రోజుల వసూళ్లు
లోక చాప్టర్ 1 తొలిరోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు, మూడో రోజున 8 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 10 కోట్ల రూపాయలు రాబట్టింది. అటు ఓవర్సీస్‌లోనూ లోక చాప్టర్ 1 చంద్ర సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. దాంతో ఇండియాలో ఈ సినిమా నాలుగు రోజుల వరకు 30 కోట్ల రూపాయల నెట్, 40 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు సాక్‌నిక్ తెలిపింది. ఓవర్సీస్‌ వసూళ్లు పరిశీలిస్తే.. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో దుల్కర్ సల్మాన్ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. భారత్‌లో వస్తున్న దానిని మించి ఓవర్సీస్‌లో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో లోక చాప్టర్ 1కు 40 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది. దాంతో కలిపి ఈ సినిమాకు నాలుగు రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 వసూళ్లు
లేట్‌గా ప్రారంభమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో దుల్కర్ సల్మాన్ సినిమా స్టడీగా వసూళ్లను రాబడుతోంది. తొలి రోజున 50 లక్షల రూపాయలు, రెండో రోజున 1.20 కోట్లు, మూడో రోజున 2 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.6 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఇండియాలోని పలు రాష్ట్రాలలో లోక చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. మలయాళంలో 25 కోట్ల రూపాయలు, తమిళంలో 3 కోట్ల రూపాయలు, తెలుగులో 5 కోట్ల రూపాయలు, కన్నడంలో 2 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.

లోక చాప్టర్ 1 ఐదో రోజు కలెక్షన్స్
వీకెండ్ తర్వాత అసలు సిసలు పరీక్షలో లోక చాప్టర్ 1 విజయం సాధించింది. సోమవారం లాంటి వర్కింగ్ డే రోజున కూడా నిలకడగా వసూళ్లు రాబట్టింది. ఐదో రోజున మలయాళం వెర్షన్‌లో 51 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ, తెలుగులో 22 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదు చేసింది ఈ చిత్రం. ఐదో రోజున దుల్కర్ సల్మాన్ మూవీకి 8 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. దాంతో కలిపి ఐదు రోజుల వరకు లోక చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకుని 100 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X