Lokah 7 days Box Office: 100 కోట్లు క్లబ్బులో లోక చాప్టర్ 1: చంద్ర.. 7వ రోజు రికార్డుస్థాయిలో ఎన్ని కోట్లంటే?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లోక చాప్టర్ 1 చంద్ర. ఈ చిత్రంలో ప్రేమలు హీరో నస్లేన్, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటించారు. కూలీ ఫేమ్ షౌబీన్, స్టార్ హీరో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. ఇంకా ఈ చిత్రంలో నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు నటించారు.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి సినిమాటోగ్రఫి, చమన్ ఛాక్కో సినిమాటోగ్రఫిని అందించారు. ఓనమ్ పండుగ సందర్భంగా ఈ సినిమా 28 ఆగస్టున రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

తెలుగులో కొత్త లోక టైటిల్‌తో విడుదలైన మలయాళ సినిమాను సూపర్ హీరోయిన్ కాన్సెప్ట్‌తో రక్త పిశాచాల బ్యాక్ డ్రాప్‌తో ఇంటెన్స్ రూరల్, అర్బన్ డ్రామాగా రూపొందించారు. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ భారీగా ఉపయోగించారు. దాంతో ఈ సినిమా నిర్మాణ వ్యయం కూడా ఎక్కువగానే అయింది. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కాస్ట్‌తో కలిపి ఈ మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 50 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
గత ఆరు రోజుల్లో లోక చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఈ చిత్రం కన్నడలో 5 కోట్ల రూపాయలు, తెలుగులో 5.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 6 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 2.5 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను నమోదు చేసింది. కేరళ మినహాయించి ఇండియాలో ఈ చిత్రం 18 కోట్ల రూపాయల నెట్, 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక మలయాళంలో లోక సినిమా వసూళ్ల విషయానికి వస్తే.. కేరళ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 3 కోట్ల రూపాయల నెట్ వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. ఆ తర్వాత రోజు రోజుకు పెంచుకొంటూ వెళ్లింది. రెండో రోజు ఈ సినిమా 3.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 6 కోట్ల రూపాయలు, 4వ రోజు 7.5 కోట్ల రూపాయలు, 5వ రోజు 5.5 కోట్ల రూపాయలు, 6వ రోజు 6 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం మొత్తంగా 31.5 కోట్ల నెట్, 55 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా భారీ కలెక్షన్లను నమోదు చేసి రికార్డు వసూళ్ల దిశగా పరుగులు పెడుతున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలిపి 50 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 100 కోట్ల రూపాయల నెట్, 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 50 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటికే 100 శాతం లాభాన్ని వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.


Click it and Unblock the Notifications











