Lokah Day 9 Collections: 150 కోట్లకు చేరువగా లోక.. దుల్కర్ సల్మాన్ మూవీకి 9వ రోజు ఎన్ని కోట్లంటే?

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన చిత్రం లోక చాప్టర్ 1: చంద్ర. కళ్యాణి ప్రియదర్శన్, నస్లేన్‌లు హీరోయిన్‌లుగా నటించారు. కూలీ ఫేమ్ షౌబీన్, స్టార్ హీరో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి, చమన్ చాకోలు సినిమాటోగ్రఫిని అందించారు. ఆగస్ట్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన లోకభారీ వసూళ్లు సాధిస్తోంది. డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడవ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల వసూళ్లు సాధించింది. ఈ వివరాలు పరిశీలిస్తే..

లోక చాప్టర్ 1 చంద్ర బడ్జెట్
లోక చాప్టర్ 1 చంద్ర సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి లోక చాప్టర్ 1 చంద్ర మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. దుల్కర్ సల్మాన్ నిర్మాత కావడం, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు, సూపర్ ఉమెన్ కాన్సెప్ట్ కావడంతో లోక చాప్టర్ 1 చంద్రపై మలయాళ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. లోక చాప్టర్ 1 చంద్ర మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే.. బాక్సాఫీస్ వద్ద కనీసం 50 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వాల్యూ నిర్దేశించాయి.

Lokah Chapter 1 Chandra Day 9 Box Office Collections Worldwide Dulquer Salman s movie heading towards 150 crores

లోక చాప్టర్ 1 చంద్ర 8 రోజుల వసూళ్లు
లోక చాప్టర్ 1 తొలిరోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 5 కోట్ల రూపాయలు, మూడో రోజున 8 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 11 కోట్ల రూపాయలు, ఐదో రోజున 8 కోట్ల రూపాయలు, ఆరో రోజున 8 కోట్ల రూపాయలు, ఏడో రోజున 8 కోట్ల రూపాయలు, ఎనిమిదవ రోజున 9 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఇండియాలో 8 రోజుల వరకు 63 కోట్ల రూపాయలు నెట్.. 70 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అటు ఓవర్సీస్‌లోనూ లోక చాప్టర్ 1 చంద్ర సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో లోక చాప్టర్ 1కు 60 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో కలిపి ఈ సినిమాకు ఎనిమిది రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో లోక చాప్టర్ 1 చంద్ర సినిమాకు తొలి రోజున 50 లక్షల రూపాయలు, రెండో రోజున 1.20 కోట్లు, మూడో రోజున 2 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 2 కోట్ల రూపాయలు , ఐదో రోజున కోటి రూపాయలు, ఆరో రోజున 1.30 కోట్ల రూపాయలు, ఐడో రోజున కోటి రూపాయలు, 8వ రోజున 1.30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలోని పలు రాష్ట్రాలలో లోక చాప్టర్ 1 వసూళ్లు పరిశీలిస్తే.. మలయాళంలో 55 కోట్ల రూపాయలు, తమిళంలో 7 కోట్ల రూపాయలు, తెలుగులో 11 కోట్ల రూపాయలు, కన్నడంలో 4 కోట్ల రూపాయలు, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 4 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.

లోక చాప్టర్ 1 తొమ్మిదవ రోజు కలెక్షన్స్
మదరాసి, ఘాటి వంటి భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్స్‌లో విడుదలైనప్పటికీ లోక దుమ్మురేపింది. ఈద్ ఉల్ నబీ పర్వదినం నాడు సెలవు కావడంతో సినిమాకు కలెక్షన్స్ బాగున్నాయి. 9వ రోజు మలయాళంలో 72 శాతం, తెలుగులో 40 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. 9వ రోజున మలయాళంలో 6 కోట్ల రూపాయలు, తమిళంలో 70 లక్షల రూపాయలు, తెలుగులో కోటి రూపాయలు, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున 10 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. దాంతో 9 రోజుల వరకు లోక చాప్టర్ 1: చంద్ర వరల్డ్ వైడ్‌గా 140 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి.. 150 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X