Lokah 13 Days Collections: 200 కోట్ల క్లబ్‌లో లోక చాప్టర్ 1.. కేరళలో రికార్డులతో సంచలనం.. ఎన్ని కోట్లంటే?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లోక చాప్టర్ 1 చంద్ర. ఈ చిత్రంలో ప్రేమలు హీరో నస్లేన్, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటించారు. కూలీ ఫేమ్ షౌబీన్, స్టార్ హీరో టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో నటించారు. ఇంకా ఈ చిత్రంలో నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు నటించారు.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి సినిమాటోగ్రఫి, చమన్ ఛాక్కో సినిమాటోగ్రఫిని అందించారు. ఓనమ్ పండుగ సందర్భంగా ఈ సినిమా 28 ఆగస్టున రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

సూపర్ హీరోయిన్ కాన్సెప్ట్‌తో రక్త పిశాచాల బ్యాక్ డ్రాప్‌తో ఇంటెన్స్ రూరల్, అర్బన్ డ్రామాగా రూపొందించారు. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ భారీగా ఉపయోగించారు. ఇక ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కాస్ట్‌తో కలిపి ఈ మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 50 కోట్ల రూపాయలు నెట్, 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
లోక చిత్రం మలయాళ చిత్రసీమలో అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. కేరళలో 100 కోట్ల సాధించిన ఏడో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. మంజుమ్మల్ బాయ్స్ 167 కోట్లు, తుడరం 140 కోట్లు, ఎంపురాన్ 120 కోట్లు, 2018 మూవీ 107 కోట్లు, పులిమురుగన్ 105 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ రికార్డును క్రియేట్ చేశాయి. తాజాగా దుల్కర్ సల్మాన్ నిర్మించిన కల్యాణి ప్రియదర్శన్ నటించిన లోక చిత్రం తాజాగా ఈ క్లబ్‌లో చేరింది. అయితే 100 కోట్ల సాధించిన తొలి హీరోయిన్‌గా దక్షిణాదిలో మరో రికార్డును సొంతం చేసుకొన్నది.
ఇక లోక చిత్రం పేరిట మరో రికార్డు కూడా క్రియేట్ అయింది. ఈ సినిమా అతి వేగంగా 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రంగా ఘనతను సాధించింది. ఎంపురాన్ తర్వాత ఈ ఘనతను సాధించిన మలయాళ చిత్రంగా, అలాగే 2025 మలయాళంలో మూడో చిత్రంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపింది.
ఇక ఈ చిత్రం గత 12 రోజుల్లో ఈ సినిమా వివిధ భాషల్లో రాబట్టిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కన్నడలో 9.5 కోట్ల రూపాయలు నెట్, తెలుగులో 12 కోట్ల రూపాయలు, తమిళనాడులో 13 కోట్ల రూపాయలు, కేరళలో 64 కోట్ల రూపాయలు నెట్ (100 కోట్లకుపైగా గ్రాస్), హిందీ, ఇతర రాష్ట్రాల్లో 5.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా సుమారుగా 105 కోట్ల రూపాయల నెట్, 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా 13వ రోజు ఇండియాలో 2 కోట్ల నుంచి 2.5 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











