Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Love Story 12 days collections: నష్టాల నుంచి బయటపడటానికి.. ఎంత వసూలు చేయాలంటే
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి నటించిన లవ్ స్టోరి చిత్రం విడుదలైన తొలి ఆట నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకొని భారీ వసూళ్లను నమోదుచేసింది. అయితే బాక్సాఫీస్ వద్ద జోరును కొనసాగిస్తున్న సమయంలో లవ్ స్టోరి కలెక్షన్లకు గులాబ్ తుఫాన్ అడ్డుకట్ట వేసింది. గులాబ్ తుఫాన్ తగ్గినా.. లవ్ స్టోరి సినిమా కలెక్షన్లు ఊపందుకోలేకపోయాయి. అయితే భారీ లాభాలు సాధిస్తుందని భావించిన ఈ చిత్రం ఎలాగోలా లాభాల జోన్‌లోకి ప్రవేశించేందుకు కష్టాలు పడినట్టు కనిపించింది. లవ్ స్టోరి 12వ రోజున ఏ మేరకు వసూళ్లను సాధించిందంటే..
లవ్ స్టోరి చిత్రం 12వ రోజున నైజాంలో రూ.8 లక్షలు, సీడెడ్‌లో రూ.5 లక్షలు, ఉత్తరాంధ్రలో 2 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.2 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.2 లక్షలు, గుంటూరులో రూ. 1 లక్ష, కృష్ణా జిల్లాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ.1 లక్ష వసూలు చేసింది. ఓవరాల్‌గా 12వ రోజున 23 లక్షల నికర, 40 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించింది.
Keerthy Suresh క్యూట్ ఫోటోలు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!
ఇక మొత్తంగా గత 12 రోజుల్లో లవ్ స్టోరి చిత్రం కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే.. నైజాంలో రూ.11.83 కోట్లు, సీడెడ్‌లో రూ.4.21 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.83 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 1.53 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.29 కోట్లు, గుంటూరులో రూ.1.46 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.1.30 కోట్లు, నెల్లూరులో రూ.84 లక్షలు సాధించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రూ.25.29 కోట్లు నికరంగా, రూ.41.14 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది.

Konda Polam ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారల తళుకుబెళుకులు.. రెచ్చిపోయిన యాంకర్ సుమ
ఆంధ్రప్రదేశ్, నైజాంలో లవ్ స్టోరి కలెక్షన్ల వివరాలు
తొలి
రోజున
---
రూ.
7.13
కోట్లు
2వ
రోజున
---
రూ.
5.08
కోట్లు
3వ
రోజున
---
రూ.
5.19
కోట్లు
4వ
రోజున
---
రూ.
2.52
కోట్లు
5వ
రోజున
---
రూ.
1.26
కోట్లు
6వ
రోజున
---
రూ.
66
లక్షలు
7వ
రోజున
---
రూ.
39
లక్షలు
8వ
రోజున
---
రూ.
49
లక్షలు
9వ
రోజున
---
రూ.
96
లక్షలు
10వ
రోజున
---
రూ.
1.10
కోట్లు
11వ
రోజున
---
రూ.
28
లక్షలు
12వ
రోజున
---
రూ.
23
లక్షలు
Rakul Preet Singh క్లీవేజ్ షో.. కొండ పొలం ఈవెంట్లో అందాల ఆరబోత
ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో లవ్ స్టోరి చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కర్టాటక, ఇతర రాష్ట్రాల్లో మొత్తంగా 1.93 కోట్లు సాధించింది. ఓవర్సీస్‌లో రూ.7 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.31.97 కోట్లు నికరంగా, రూ.57 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది.
Tejaswi Madivada: రెచ్చిపోయిన ఐస్ క్రీమ్ భామ.. బీచ్ ఒడ్డున బికినీతో అందాల విందు
లవ్ స్టోరి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.31.5 కోట్ల మేర చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.32 కోట్లకుపైగా నికర వసూళ్లను రాబట్టాల్సింది. అయితే 12వ రోజుకు లవ్ స్టోరి చిత్రం రూ.31.97 కోట్ల మేర వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పాయింట్‌కు చేరువగా ఉంది.