For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Love Story Day 1 collections.. నాగచైతన్య కెరీర్లోనే బెస్ట్ గా కలెక్షన్లు.. ఏ రేంజ్‌లో అంటే!

  |

  టాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. ఇప్పటికే సెకండ్ వేవ్ తరువాత కొందరు యువ హీరోల సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే కాకుండా వసూళ్లను కూడా సాధిస్తున్నాయి. సెకండ్ వేవ్ కరోనా తర్వాత చిన్న బడ్జెట్ చిత్రాలు భారీ విజయాన్ని సాధిస్తూ ఊహించని వసూళ్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

  ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన తాజా చిత్రం లవ్ స్టోరీ. ఇప్పటికే మజిలీ, వెంకీ మామ అని రెండు హిట్లతో జోష్ మీద ఉన్న విశ్వక్ సేన్, వరుస హిట్స్ తో జోరు మీదున్న శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో తొలి సరిగా తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ. సినిమా నుంచి విడుదలైన ట్రైలర్లు, టీజర్లు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
  అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సహా ప్రీ బుకింగ్స్ కూడా బాగా జరగడంతో తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే...

  వాయిదాలతో ఇలా

  వాయిదాలతో ఇలా

  నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా 'లవ్ స్టోరీ'. వాస్తవానికి ఈ సినిమా ఏప్రిల్ 2, 2020లోనే రిలీజ్ కావాల్సింది. అయితే కరోనా నేపథ్యంలో ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. భారత్‌లో కరోనా పరిస్థితలు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేసింది. అయితే అదే సమయానికి నాని హీరోగా వచ్చిన టక్ జగదీశ్ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధం కావడంతో ఈ సినిమాను వాయిదా వేసి ఈరోజు రిలీజ్ చేశారు.

  భారీ అంచనాలు

  భారీ అంచనాలు

  అయితే ఈ సినిమా విడుదలకు ముందే ప్రీ బుకింగ్స్ విషయంలో ఇక్కడే కాక అమెరికాలో సైతం రికార్డులు సృష్టించింది. ప్రీ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా భారీ మొత్తంలో డబ్బులను రాబట్టింది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన 'లవ్ స్టోరీ' మూవీ ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమా అంచనాలకు తగినట్టే రిలీజ్‌కు ముందు ఆసక్తిని అటు ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులు పెంచుకు న్నారు. ఈ క్రమంలో చైతన్య కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా హయ్యెస్ట్ బిజినెస్ జరిగింది.

  చైతూ కెరీర్లోనే బెస్ట్

  చైతూ కెరీర్లోనే బెస్ట్

  ప్రస్తుతం ఫిలిం నగర్‌ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు 'లవ్‌ స్టోరి' సినిమా వరల్డ్‌వైడ్ 32.8 కోట్ల రూపాయాల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్లాక్‌బస్టర్ ఆడియోతో ఈ సినిమా ప్రేక్షకులలో చాలా హైప్ మరియు ఇంట్రెస్ట్‌ను పెంచింది. ఆంధ్ర హక్కులు 16.8 కోట్ల రూపాయలకు సేల్ అయ్యాయని తెలుస్తోంది. శేఖర్‌ కమ్ముల సినిమాలకు ఉండే డిమాండ్ దృష్ట్యా ఓవర్‌సీస్‌లోనూ సినిమాకు సూపర్ బిజినెస్ చేసిందని ఓవర్‌సీస్‌ హక్కులు నాలుగు కోట్లకు పైగా సేల్ అయిందని అంటున్నారు.

  నైజాం ఏరియాలో 11 కోట్ల రూపాయల బిజినెస్ చేసిందని అంటున్నారు. ఇక లవ్‌ స్టోరి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.32.8 కోట్ల మేర జరగడంతో సినిమా ముందు భారీ లక్ష్యం నిలిచింది. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.36 కోట్ల దాకా లాభాలను రాబట్టాల్సి ఉంటుంది. దీంతో బాక్సాఫీస్ పోరులో ఈ లవ్ స్టోరీ సినిమాని నాగచైతన్య, సాయి పల్లవిలు లాభాల్లోకి తెస్తారా లేదా అనే విషయాన్ని వేచి చూడాల్సింది.

  మంచి ప్రీ రిలీజ్

  మంచి ప్రీ రిలీజ్

  సినిమా తెలుగు రాష్ట్రాల్లో 640 థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ డే థియేటర్స్ కౌంట్ 700కి పెరిగింది. అలా మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 1000కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. వారం ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ మొదలు కాగా నైజాంలో టికెట్ రేట్లు పెంచుకోవడంతో బుకింగ్స్ కొంచెం స్లో గా మొదలయినా ఇప్పుడు పుంజుకుని 60-65% ఆక్యుపెన్సీతో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలతో దూసుకు పోయింది. ఆంధ్రలో కూడా వైజాగ్ లో మంచి ప్రీ బుకింగ్స్ తో మొదలయిన సినిమా మిగిలిన చోట్ల కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తోంది.

  అక్కడ టికెట్ రేట్లు కొంచెం తక్కువ ఉండడమే కాక 50% ఆక్యుపెన్సీ ఉండటంతో...కలెక్షన్స్ ఎలా వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. మార్నింగ్ మ్యాట్నీ షోల బుకింగ్స్ చూస్తుంటే 5 కోట్లు కలెక్షన్స్ మినిమం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు.

   అదే జరిగితే భారీ కలెక్షన్స్

  అదే జరిగితే భారీ కలెక్షన్స్

  సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఇదే జోరు కొనసాగిస్తే అవలీలగా 6.5 కోట్ల నుంచి 7 కోట్ల వరకు కలెక్షన్స్ ఖాయం అని అంటున్నారు. అయితే ఇదంతా కేవలం కౌంటర్ టికెట్స్ లెక్క మాత్రమే కాకాగా ఆన్ లైన్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే భారీగా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి. ఇక ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ప్రీ సేల్స్ ప్రకారం 'లవ్ స్టోరీ' అమెరికాలో 150,000 డాలర్లను రాబట్టినట్లు సమాచారం. దీని విలువ ఇండియన్ కరెన్నీలో సుమారు రూ.1.10కోట్ల వరకు ఉంటుంది.

  English summary
  Young hero naga chaitanya's Love Story hits the screen on september 24. Here is the Love Story movie Day 1 expected collections worldwide.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X