Madharaasi Closing Collection: మదరాసి క్లోజింగ్ కలెక్షన్స్.. శివకార్తికేయన్ మూవీకి లాభమెంత? నష్టమెంత?

శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ నిర్మించిన చిత్రం మదరాసి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తీకేయన్ హీరోగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. మదరాసి సినిమాలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమవాల్, బిజు మీనన్, విక్రాంత్, ప్రేమ్ కుమార్ తదితరులు మదరాసిలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

అమరన్ తర్వాత శివకార్తీకేయన్ నటించిన సినిమా కావడంతో పాటు తొలిసారిగా ఏఆర్ మురగదాస్ వంటి స్టార్ డైరెక్టర్‌తో కలిసి శివకార్తీకేయన్ నటించడంతో మదరాసిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మదరాసి సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? లాభమెంత? నష్టమెంత? ఈ వివరాల్లోకి వెళితే..

Madharaasi Box Office Closing Collections Worldwide How much loss or profit for Sivakarthikeyan s Movie

మదరాసి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ఇతర ప్రమోషనల్ ఖర్చులు కలిపి మదరాసి సినిమాకు 200 కోట్ల రూపాయల వ్యయమైనట్లుగా కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్లు, శివకార్తీకేయన్ - ఏఆర్ మురుగదాస్ కాంబో కారణంగా మదరాసి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మదరాసి సినిమా హక్కులు 10 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. ఇక్కడ శివకార్తీకేయన్ సినిమా లాభాల్లోకి రావాలంటే 11 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

మదరాసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఆంధ్రా, నైజాంతో పాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి వరల్డ్ వైడ్‌గా మదరాసి చిత్రానికి 95 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

మదరాసి కలెక్సన్స్:
మదరాసికి ఇండియా వైడ్ తొలిరోజున 15 కోట్ల రూపాయలు, 2వ రోజున 13 కోట్ల రూపాయలు, 3వ రోజున 12 కోట్ల రూపాయలు, 4వ రోజున 5 కోట్ల రూపాయలు, 5వ రోజున 3.5 కోట్ల రూపాయలు, 6వ రోజున 3 కోట్ల రూపాయలు, 7వ రోజున 2 కోట్ల రూపాయలు, 8వ రోజున 2 కోట్ల రూపాయలు, 9వ రోజున 3 కోట్ల రూపాయలు, 10వ రోజున 3.5 కోట్ల రూపాయలు, 11వ రోజున కోటి రూపాయలు, 12వ రోజున కోటి 10 లక్షల రూపాయలు, 13వ రోజున కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో 13 రోజుల వరకు శివకార్తీకేయన్ మూవీకి 60 కోట్ల రూపాలయ నెట్, 68 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్, మిడిల్ ఈస్ట్‌ తదితర ఓవర్సీస్ మార్కెట్‌లో మదరాసికి పర్లేదనే స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. 13 రోజుల వరకు ఓవర్సీస్‌లో శివకార్తీకేయన్ మూవీకి 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి మదరాసి చిత్రానికి 93 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో మదరాసి కలెక్షన్స్ చూస్తే.. తొలి రోజు 2 కోట్ల రూపాయలు, 2వ రోజు కోటి 20 లక్షల రూపాయలు, 3వ రోజున కోటి రూపాయలు, 4వ రోజున 50 లక్షల రూపాయలు, 5వ రోజున 50 లక్షల రూపాయలు, 6వ రోజున 40 లక్షల రూపాయలు, 7వ రోజున 30 లక్షల రూపాయలు, 8వ రోజున 5 లక్షల రూపాయలు, 9వ రోజున 5 లక్షల రూపాయలు, 10వ రోజున 3 లక్షల రూపాయలు, 11వ రోజున 2 లక్షల రూపాయలు, 12వ రోజున 2 లక్షల రూపాయలు, 13వ రోజున 3 లక్షల రూపాయలు చొప్పున 6 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో మదరాసి కలెక్షన్స్ పరిశీలిస్తే.. తమిళనాడులో57 కోట్ల రూపాయలు, హిందీలో 2 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రూపాయలు, కన్నడ+ కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు చొప్పున రాబట్టింది.

మదరాసి మూవీకి లాభమెంత? నష్టమెంత?
మిక్స్‌డ్ టాక్ రావడంతో మదరాసి మూవీ తన బాక్సాఫీస్ జర్నీని పడుతూ లేస్తూ అన్నట్లుగా సాగించింది. వీకెండ్‌లో ఫర్వాలేదనిపించినా, వీక్‌డేస్‌లో మాత్రం కలెక్షన్స్ కోల్పోయింది శివకార్తీకేయన్ చిత్రం. కూలీ, వార్ 2, మిరాయ్ తదితర చిత్రాల నుంచి ఈ మూవీకి గట్టి పోటీ ఎదురైంది. అయినప్పటికీ శివకార్తీకేయన్ ఈ సినిమాను తన భుజాలపై మోశాడు.

తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు గాను .. మదరాసి చిత్రం కేవలం 6 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ మాత్రమే రాబట్టి 5 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చాడు శివకార్తీకేయన్. ఇక వరల్డ్ వైడ్‌గా ఓవరాల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కనుక చూస్తే 200 కోట్ల రూపాయలకు గాను .. 95 కోట్ల కోట్ల రూపాయల షేర్ రాబట్టి 105 కోట్ల రూపాయల నష్టాలను తీసుకొచ్చింది మదరాసి. మొత్తంగా 13 రోజుల వరకు శివకార్తీకేయన్ - ఏఆర్ మురుగదాస్ చిత్రం కేవలం 50 శాతం మాత్రమే రికవరీ సాధించింది. నిర్మాతలు ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల బడ్జెట్‌ను కేటాయించగా.. ఓవరాల్ బడ్జెట్ మీద ఈ సినిమా నిర్మాతలకు దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను మిగిల్చింది. అయితే థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాత ఒడ్డునపడే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X