Madharaasi Day 1 Box Office: షాకిచ్చేలా మదరాసి ఓపెనింగ్స్.. శివకార్తీకేయన్ మూవీకి ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?
విలక్షణ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ నటించిన చిత్రం మదరాసి. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజైన మదరాసి సినిమాలో శివకార్తీకేయన్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. విద్యుత్ జమవాల్, బిజు మీనన్, విక్రాంత్, ప్రేమ్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మదరాసి సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు శివకార్తీకేయన్ మూవీ ఎన్ని కోట్ల వసూళ్లు సాధించిందో చూస్తే..
మదరాసి ప్రీ రిలీజ్ బిజినెస్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ఇతర ప్రమోషనల్ ఖర్చులు కలిపి మదరాసి సినిమాకు 200 కోట్ల రూపాయల వ్యయమైంది. ఏఆర్ మురగదాస్ - శివకార్తీకేయన్ కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలతో మదరాసి మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో శివకార్తీకేయన్ మూవీకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మదరాసి సినిమా హక్కులు 10 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. దీంతో ఆంధ్రా, నైజాంలలో మదరాసి సినిమా లాభాల్లోకి రావాలంటే 11 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

మదరాసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఆంధ్రా, నైజాంతో పాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి వరల్డ్ వైడ్‌గా మదరాసి చిత్రానికి 95 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
మదరాసి తొలిరోజు కలెక్షన్స్
విడుదలకు ముందే మదరాసిపై భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో తొలిరోజు ఈ సినిమా టికెట్ల కోసం ప్రేక్షకులు ఎగబడ్డారు. ఫస్ట్ డే ఒక్క తమిళనాడులోనే దాదాపు 3.07 లక్షల టికెట్లు అమ్ముడైనట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే తొలి రోజు తమిళనాడులో 5.40 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో 1.20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయల చొప్పున ప్రీ సేల్స్‌లో 9 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు అంటున్నారు.
మదరాసి తొలి రోజు కలెక్షన్స్ చూస్తే.. శివకార్తీకేయన్ మూవీకి సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు తమిళంలో 48 శాతం, హిందీలో 2 శాతం, తెలుగులో 25 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. మదరాసి చిత్రం తొలిరోజున తమిళనాడులో 8 కోట్ల రూపాయలు, తెలుగులో 4 కోట్ల రూపాయలు, కేరళ, కర్ణాటక+ రెస్టాఫ్ ఇండియాలలో 3 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయల చొప్పున ఫస్ట్ డే 20 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. శివకార్తీకేయన్ గత చిత్రం వరల్డ్ వైడ్‌గా తొలిరోజు 30 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టగా.. మదరాసి ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టకపోవచ్చునని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. మరి శివకార్తీకేయన్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











