Madharaasi Day 2 Box Office: మదరాసికి రెండో రోజు భారీ దెబ్బ.. శివకార్తీకేయన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ నటించిన చిత్రం మదరాసి. సెప్టెంబర్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శివకార్తీకేయన్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ నేపథ్యంలో మదరాసి సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు శివకార్తీకేయన్ మూవీ ఎన్ని కోట్ల వసూళ్లు సాధించిందో చూస్తే..

మదరాసి బడ్జెట్ ఎంత?
ఈ సినిమా కోసం టాలెంటెడ్ నటీనటులు, టెక్నీషియన్లు భాగస్వాములయ్యారు. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమవాల్, బిజు మీనన్, విక్రాంత్, ప్రేమ్ కుమార్ తదితరులు మదరాసిలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ఇతర ప్రమోషనల్ ఖర్చులు కలిపి మదరాసి సినిమాకు 200 కోట్ల రూపాయల వ్యయమైంది.

Madharaasi Day 2 Expected Box Office Collections Worldwide Sivakarthikeyan s movie drops second day

మదరాసి ప్రీ రిలీజ్ బిజినెస్
ఏఆర్ మురగదాస్ - శివకార్తీకేయన్ కాంబోతో పాటు అమరన్ తర్వాత శివకార్తీకేయన్ నటించిన సినిమా కావడంతో మదరాసి మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఈ మూవీకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మదరాసి సినిమా హక్కులు 10 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. దీంతో ఆంధ్రా, నైజాంలలో మదరాసి సినిమా లాభాల్లోకి రావాలంటే 11 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

మదరాసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఆంధ్రా, నైజాంతో పాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి వరల్డ్ వైడ్‌గా మదరాసి చిత్రానికి 95 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

మదరాసి తొలి రోజు కలెక్షన్స్
200 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన మదరాసి చిత్రం తొలి రోజు మిక్స్‌డ్ టాక్‌తో జర్నీ ప్రారంభించింది. తొలి రోజు ఈ సినిమా 20 కోట్లు రాబట్టింది. తమిళంలో 12 కోట్ల రూపాయలు, తెలుగులో 2 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు చొప్పున వసూలు చేసింది. దాంతో ఇండియాలో తొలి రోజున 13 కోట్ల రూపాయలు నెట్, 15 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమాకు 5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

మదరాసి రెండో రోజు కలెక్షన్స్
తొలిరోజు భారీ వసూళ్లు సాధిస్తుందని అంచనా వేసినప్పటికీ మదరాసి చిత్రం ఆ అంచనాలను నిలబెట్టకోలేకపోయింది. కేవలం 20 కోట్లతోనే సరిపెట్టుకుంది. అయితే రెండో రోజు కూడా మదరాసి పరిస్ధితులు ఏమాత్రం మారలేదు. ఆదివారం కూడా బుకింగ్స్ డల్‌గా సాగుతున్నాయి. సాయంత్రం 7 గంటల వరకు తమిళంలో 50 శాతం, తెలుగులో 19 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. రెండో రోజు మదరాసికి కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. తమిళంలో 5 కోట్ల రూపాయలు, తెలుగులో కోటి రూపాయలు, హిందీ+ రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున రెండో రోజు 10 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. మొత్తంగా రెండ్రోజుల వరకు మదరాసి సినిమాకు 30 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X