Madharaasi Day 3 Box Office: రేసులోకి శివకార్తీకేయన్.. మదరాసి మూవీకి 3వ రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?

శివకార్తీకేయన్ హీరోగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మదరాసి. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో మదరాసి సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు శివకార్తీకేయన్ మూవీ ఎన్ని కోట్ల వసూళ్లు సాధించిందో చూస్తే..

మదరాసి బడ్జెట్ ఎంత?
మదరాసి సినిమాలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమవాల్, బిజు మీనన్, విక్రాంత్, ప్రేమ్ కుమార్ తదితరులు మదరాసిలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ఇతర ప్రమోషనల్ ఖర్చులు కలిపి మదరాసి సినిమాకు 200 కోట్ల రూపాయల వ్యయమైనట్లుగా కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.

Madharaasi Day 3 Expected Box Office Collections Worldwide Sivakarthikeyan s movie holds decent number

మదరాసి ప్రీ రిలీజ్ బిజినెస్
టీజర్, ట్రైలర్లు, శివకార్తీకేయన్ - ఏఆర్ మురుగదాస్ కాంబో కారణంగా మదరాసి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మదరాసి సినిమా హక్కులు 10 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. దీంతో ఆంధ్రా, నైజాంలలో మదరాసి సినిమా లాభాల్లోకి రావాలంటే 11 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

మదరాసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఆంధ్రా, నైజాంతో పాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి వరల్డ్ వైడ్‌గా మదరాసి చిత్రానికి 95 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

మదరాసి తొలి రోజు కలెక్షన్స్
తొలి రోజు శివకార్తీకేయన్ మూవీకి ఇండియా వైడ్‌గా తొలి రోజు 15 కోట్ల రూపాయలు, రెండో రోజు 13 కోట్ల రూపాయలు చొప్పున రెండ్రోజుల్లో 26 కోట్ల రూపాయల నెట్.. 32 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్‌లో శివకార్తీకేయన్ మూవీకి సాలీడ్ బుకింగ్స్ నమోదవుతున్నాయి. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్ తదితర దేశాలతో కలిపి మొత్తంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మదరాసి మూవీకి వరల్డ్ వైడ్‌గా 47 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున మదరాసి మూవీకి 2 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.50 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో మదరాసి కలెక్షన్స్ పరిశీలిస్తే.. తమిళనాడులో 24 కోట్ల రూపాయలు, తెలుగులో 3.50 కోట్ల రూపాయలు, హిందీలో 50 లక్షల రూపాయలు, కేరళ+ రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి.

మదరాసి మూడో రోజు కలెక్షన్స్
ఆదివారం కావడంతో మదరాసికి 3వ రోజు బుకింగ్స్ బాగా జరుగుతున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు శివకార్తీకేయన్ మూవీకి తమిళంలో 55 శాతం, తెలుగులో 21 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. దాంతో 3 రోజు మదరాసి చిత్రానికి తమిళంలో 5 కోట్ల రూపాయలు, తెలుగులో కోటి 60 లక్షల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలు చొప్పున రెండో రోజు 10 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. ఆదివారం మార్నింగ్ షో నాటికే మదరాసి చిత్రం 50 కోట్ల క్లబ్‌లోకి చేరిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా మూడు రోజుల వరకు మదరాసి సినిమాకు వరల్డ్ వైడ్‌గా 60 కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X