Madharaasi Day 5 Box Office: దారుణంగా మదరాసి వసూళ్లు.. శివకార్తీకేయన్ మూవీ లాభాల్లోకి రావాలంటే?
శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఎన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ నిర్మించిన చిత్రం మదరాసి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తీకేయన్ హీరోగా, రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించారు. మదరాసి సినిమాలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమవాల్, బిజు మీనన్, విక్రాంత్, ప్రేమ్ కుమార్ తదితరులు మదరాసిలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుదీప్ ఎలమన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ నేపథ్యంలో మదరాసి సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఐదో రోజు శివకార్తీకేయన్ మూవీ ఎన్ని కోట్ల వసూళ్లు సాధించిందో చూస్తే..
మదరాసి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ఇతర ప్రమోషనల్ ఖర్చులు కలిపి మదరాసి సినిమాకు 200 కోట్ల రూపాయల వ్యయమైనట్లుగా కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. టీజర్, ట్రైలర్లు, శివకార్తీకేయన్ - ఏఆర్ మురుగదాస్ కాంబో కారణంగా మదరాసి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఈ మూవీకి వరల్డ్ వైడ్‌గా భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మదరాసి సినిమా హక్కులు 10 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. దీంతో ఆంధ్రా, నైజాంలలో మదరాసి సినిమా లాభాల్లోకి రావాలంటే 11 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్.. 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది.

మదరాసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
ఆంధ్రా, నైజాంతో పాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి వరల్డ్ వైడ్‌గా మదరాసి చిత్రానికి 95 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
మదరాసి నాలుగు రోజుల కలెక్షన్స్
తొలి రోజు శివకార్తీకేయన్ మూవీకి ఇండియా వైడ్‌గా తొలి రోజు 15 కోట్ల రూపాయలు, రెండో రోజు 13 కోట్ల రూపాయలు, మూడో రోజు 11 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఇండియాలో నాలుగు రోజుల్లో మదరాసి సినిమాకు 41 కోట్ల రూపాయల నెట్, 44 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే మదరాసి సినిమాను ఓవర్సీస్ ప్రేక్షకులు కాపాడుతున్నారు. ఇక్కడ నాలుగు రోజుల్లో శివ కార్తీకేయన్ సినిమాకు 22 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి మదరాసి మూవీకి వరల్డ్ వైడ్‌గా 66 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున మదరాసి మూవీకి 2 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.50 కోట్ల రూపాయలు, మూడో రోజున కోటి రూపాయలు, నాలుగో రోజున 70 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలోని ఇతర రాష్ట్రాలలో మదరాసి కలెక్షన్స్ పరిశీలిస్తే.. తమిళనాడులో 38 కోట్ల రూపాయలు, తెలుగులో 5 కోట్ల రూపాయలు, హిందీలో కోటి 50 లక్షల రూపాయలు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయల చొప్పున వసూళ్లు వచ్చాయి.
మదరాసి ఐదో రోజు కలెక్షన్స్
వీకెండ్ వరకు శివకార్తీకేయన్ మూవీ బాగానే రాబట్టింది. ఎప్పుడైతే వర్కింగ్ డేస్ మొదలయ్యాయో నాటి నుంచి మదరాసికి వసూళ్లు పడిపోయాయి. ఐదో రోజు సాయంత్రం 5 గంటల వరకు శివకార్తీకేయన్ మూవీకి తమిళ వెర్షన్‌లో 21 శాతం, తెలుగులో 16 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. పరిస్ధితి చూస్తుంటే మంగళవారం మరింత దారుణంగా వసూళ్లు పడిపోయే పరిస్ధితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదో రోజు మదరాసి మూవీకి తమిళంలో 2 కోట్ల రూపాయలు, తెలుగులో 50 లక్షలు, హిందీలో 30 లక్షలు, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 40 లక్షలు, ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయల చొప్పున 5 కోట్ల రూపాలయ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. దాంతో ఐదు రోజుల వరకు మదరాసి చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 71 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. శివకార్తీకేయన్ మూవీ లాభాల్లోకి రావాలంటే ఇంకా 130 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











