Mahavatar Narasimha Day 22 Collections : కూలి, వార్ 2లకు గట్టి పోటీ.. మహావతార్ నర్సింహా 4వ వారంలోనూ దూకుడు

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలు కూలి, వార్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చినా కూడా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహా కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. 3 వారాలుగా స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రీతిలో వసూళ్లు అందుకుంది. ఈ క్రమంలో మహావతార్ నర్సింహా చిత్రం బడ్జెట్ ఎంత? 22వ రోజుల కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

మహావతార్ నర్సింహా బడ్జెట్?
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కన్నడ టాప్ ఫిల్మ్ కంపెనీ హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలు నిర్మించాయి. నటీనటులు లేని ఈ చిత్రంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్, డైరెక్షన్ టీమ్స్ ప్రధాన పాత్రలు పోషించాయి. ఇలా రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు కలుపుకొని సినిమాకు రూ.15 కోట్లు ఖర్చైందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు. ఇక రూ.30 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని విలువ కట్టారు.

Mahavatar Narsimha Movie Day 22 Box Office Collections Worldwide

21 రోజుల వసూళ్లు ఎంత?
ఓపెనింగ్ డే రూ.2 కోట్లు, 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు, 9వ రోజు రూ.15.4 కోట్లు, 10వ రోజు రూ.23.1 కోట్లు, 11వ రోజు రూ.7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు రూ.6 కోట్లు, 14వ రోజు రూ.5.35 కోట్లు, 15వ రోజు రూ.7.5 కోట్లు, 16వ రోజు రూ.20.25 కోట్లు, 17వ రోజు రూ.23.5 కోట్లు, 18వ రోజు రూ.5.25 కోట్లు, 19వ రోజు రూ.6.1 కోట్లు, 20వ రోజు రూ.4.75 కోట్లు, 21వ రోజు రూ.2.6 కోట్లు వసూల్ చేసింది. ఇలా 3వ వారం పూర్తయ్యే సరికి ఇండియా నెట్ రూ.189 కోట్లకు చేరుకుంది.

22వ రోజు వసూళ్లు?
మహావతార్ నర్సింహా చిత్రం బాక్సాఫీస్ వద్ద శుక్రవారం ఆగస్టు 15తో 4వ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆగస్టు 14న రజనీకాంత్ కూలి, జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 చిత్రాలు వరల్డ్ వైడ్ గా విడుదలయ్యాయి. అయినప్పటికీ మహావతార్ నర్సింహా వసూళ్లు ఆగడం లేదు. 22వ రోజు 7.50 కోట్ల రూపాయల ఇండియా నెట్ ను వసూల్ చేసింది. ఇందులో కన్నడలో రూ.35 లక్షలు, తెలుగులో రూ.85 కోట్ల నెట్, హిందీ రూ.6.15 కోట్ల నెట్ వసూలైందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. తమిళం+మలయాళంలో కలిపి రూ.10 లక్షలు వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. భారీ చిత్రాలు రిలీజ్ అయినా ఈ చిత్రం వసూళ్లలో దూకుడుగా ఉండటం మరీ ఆశ్చర్యకరంగా మారింది. అది కూడా 4వ వారంలో ఇలాంటి కలెక్షన్స్ రావడం విశేషం.

రాష్ట్రాల వారీగా..
కర్ణాటక రాష్ట్రంలో రూ.6.12 కోట్లు, తెలంగాణ+ఏపీ కలుపుకొని రూ.39.3 కోట్లు, నార్త్ ఇండియాలో రూ.148. కోట్లు, తమిళ నాడులో రూ.2.51 కోట్లు, కేరళలో రూ.50 లక్షల వరకు నెట్ వసూల్ చేయడం విశేషం.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చే వరకు మహావతార్ నర్సింహా ఇండియా నెట్ రూ.200 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.240 కోట్లు, ఇక ఓవర్సీస్ లో రూ.15 కోట్లు వసూళ్లు చేసింది. ఇలా వరల్డ్ వైడ్ గా ఇండియా + ఓవర్సీస్ కలుపుకొని రూ.255 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాల లెక్కలు తెలుపుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం.. ఈ చిత్రం 220 కోట్ల రూపాయల గ్రాస్ లాభాన్ని అందుకుందని వెల్లడిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X