Mahavatar Narasimha Collections : 15 కోట్ల బడ్జెట్.. 100ల కోట్ల లాభం.. మహావతార్ నర్సింహా సంచలన వసూళ్లు
4 వారాలుగా మహావతార్ నర్సింహా చిత్రం బాక్సాఫీస్ వద్ద షాకింగ్ వసూళ్లను అందుకుంటోంది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి జూలై 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యానిమేటెడ్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం కూలి, వార్ 2 చిత్రాలు విడుదలైనప్పటికీ మహావతార్ నర్సింహా చిత్రం మరింతగా వసూళ్లను అందుకుంటోంది. ఇక మహావతార్ నర్సింహా చిత్రం బడ్జెట్ ఎంత? 26 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు ఎంత? ఎన్ని కోట్ల లాభం వచ్చిందనే వివరాల్లోకి వెళితే..
మహావతార్ నర్సింహా బడ్జెట్?
ఈ యానిమేటెడ్ ఫిల్మ్ మహావతార్ నర్సింహాను హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలు సంయుక్తంగా నిర్మించాయి. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. నటీనటులు లేని ఈ చిత్రంలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్, డైరెక్షన్ టీమ్స్ కీలక పాత్రలు పోషించడం విశేషం. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు కలుపుకొని ఈ సినిమాకు రూ.15 కోట్లు ఖర్చైంది, ఇక లాభాల్లోకి రావాలంటే రూ.30 కోట్ల గ్రాస్ వసూల్ చేయాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

26 రోజుల వసూళ్లు ఎంత?
మహావతార్ నర్సింహా చిత్రం ఆగస్టు 19 వరకు బాక్సాఫీస్ వద్ద 26 రోజులను పూర్తి చేసుకుంది. ఇక ఓపెనింగ్ డే రూ.2 కోట్లు, 2వ రోజు రూ.4.5 కోట్లు, 3వ రోజు రూ.9.5 కోట్లు, 4వ రోజు రూ.6 కోట్లు, 5వ రోజు రూ.7.5 కోట్లు, 6వ రోజు రూ.7.5 కోట్లు, 7వ రోజు రూ.7 కోట్లు, 8వ రోజు రూ.7.5 కోట్లు, 9వ రోజు రూ.15.4 కోట్లు, 10వ రోజు రూ.23.1 కోట్లు, 11వ రోజు రూ.7.35 కోట్లు, 12వ రోజు 8.5 కోట్లు, 13వ రోజు రూ.6 కోట్లు, 14వ రోజు రూ.5.35 కోట్లు, 15వ రోజు రూ.7.5 కోట్లు వసూల్లు చేసింది.
ఇక 16వ రోజు రూ.20.25 కోట్లు, 17వ రోజు రూ.23.5 కోట్లు, 18వ రోజు రూ.5.25 కోట్లు, 19వ రోజు రూ.6.1 కోట్లు, 20వ రోజు రూ.4.75 కోట్లు, 21వ రోజు రూ.2.6 కోట్లు, 22వ రోజు రూ.7.25 కోట్లు, 23వ రోజు రూ.6.75 కోట్లు, 24వ రోజు రూ.8.15 కోట్లు, 25వ రోజు రూ.2.35 కోట్ల ఇంయా నెట్ వసూల్ చేసిందని సాక్ నిక్ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక 26వ రోజు రూ.3 కోట్ల ఇండియా నెట్ అందుకుంది. దీంతో 26 రోజుల్లో ఇండియా నెట్ రూ.217 కోట్లకు చేరుకుంది.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
ఇప్పటి వరకు మహావతార్ నర్సింహా చిత్రం ఇండియా నెట్ రూ.217 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.260 కోట్లు, ఓవర్సీస్ లో రూ.23 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇక 26 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.283 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక 15 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి రూ.250 కోట్ల గ్రాస్ లాభం అందిందని తెలుపుతున్నారు.
స్టేట్ వైజ్ వసూళ్లు..
కన్నడలో మహావతార్ నర్సింహాకు రూ.7 కోట్లు, తెలుగులో రూ.42 కోట్లు, హిందీలో రూ.164 కోట్లు, తమిళంలో రూ.2.50 కోట్లు, మలయాళంలో రూ.52 లక్షలు వసూళ్లు చేసింది. ప్రస్తుతం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో వసూళ్లు అందుతూనే ఉన్నాయి. రజనీకాంత్ కూలి చిత్రం, జూఎన్టీఆర్ వార్ 2 చిత్రాలకు పోటీగా మహావతార్ నర్సింహా చిత్రం వసూళ్ల రాబడుతుంటం మరింత ఆశ్చర్యంగా మారింది.


Click it and Unblock the Notifications











