Don't Miss!
- News
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కీలక నిర్ణయం.. ఆ సేవలు నిలిపివేత!
- Finance
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?
- Lifestyle
స్త్రీ, పురుషులు ఇద్దరూ తమ సంతానోత్పత్తని మెరుగుపరుచుకోవడానికి ఇవి తినాలి!
- Technology
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
- Sports
INDvsNZ : మూడో వన్డేలో టాప్ స్కోర్ చేసే బ్యాటర్ ఎవరు?.. ఈ ముగ్గురి మధ్య పోటీ!
- Automobiles
మాజీ విశ్వ సుందరి 'సుస్మితా సేన్' మనసు దోచిన లగ్జరీ కారు.. ధర ఎంతో తెలుసా?
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Okkadu Collections: రీ రిలీజ్ లో మహేష్ సాలీడ్ కలెక్షన్స్.. కానీ పవన్ రికార్డ్ ను టచ్ కూడా చేయలేదు!
ఇటీవల కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ అనేది స్టార్ హీరోల అభిమానులకు చాలా మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. 20 ఏళ్ల క్రితం విడుదలైన సినిమాలను కూడా థియేటర్లలో కొత్త సినిమా తరహాలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉండడం సరికొత్త ట్రెండ్ అయింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తున్న విషయం తెలిసిందే.
ఇక రీసెంట్ గా మహేష్ బాబు ఒక్కడు సినిమాను కూడా మళ్ళీ విడుదల చేయగా ఈ సినిమా ఒక రికార్డును అయితే అందుకుంది. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలను మాత్రం టచ్ చేయలేకపోయింది. మొత్తంగా మహేష్ బాబు ఒక్కడు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

20 ఏళ్ళ తరువాత
మహేష్ బాబు భూమిక జంటగా నటించిన ఒక్కడు సినిమా 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు ప్రొడక్షన్లో గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్దకు సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహేష్ బాబుకు మొదటగా మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఇదే. అలాంటి సినిమాను మళ్ళీ ఇన్నాళ్లకు థియేటర్లలో భారీ స్థాయిలో రీ రిలీజ్ చేశారు.

మొదటి రోజు కలెక్షన్స్
ఇక జనవరి 7వ తేదీన థియేటర్లలో ఈ రీ రిలీజ్ సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే.. ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాలో వారీగా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజంలో ఈ సినిమా 90 లక్షలు, సీడెడ్ లో 22 లక్షలు అలాగే ఆంధ్ర మొత్తంలో కూడా 78 లక్షలను కలెక్ట్ చేసింది. నైజాం ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా ఈ సినిమాకు 1.90 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 1.90 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకున్న ఒక్కడు సినిమా కర్ణాటక అలాగే మిగతా రాష్ట్రాల్లో మొత్తంగా 15 లక్షలు వసూళ్లను సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మొదటి రోజు ఒక్కడు సినిమా 2.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఖుషి సినిమాను టచ్ చేయని ఒక్కడు
ఒక్కడు సినిమాకు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ అయితే మంచిగానే వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా మొదటి రోజు రికార్డులలో మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలను టచ్ చేయలేకపోయింది. ఎందుకంటే ఖుషి సినిమా మొదటి రోజు రీ రిలీజ్ లో నైజాం ఏరియాలో 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. జల్సా సినిమా 1.26 కోట్లను అందుకుంది. ఇక ఆ తర్వాత ఒక్కడు 90 లక్షల కలెక్షన్స్ తో మూడవ స్థానంలో నిలిచింది.

టాప్ రీ రిలీజ్ కలెక్షన్స్
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ సినిమాల టాప్ డే 1 కలెక్షన్స్ చూసుకుంటే.. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా 3.62 కోట్లను అందుకోగా జల్సా సినిమా 2.57 కోట్ల వసూళ్లను సాధించింది. ఇక వీటి తర్వాత ఒక్కడు సినిమా మొత్తంగా 1.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత 1.52 కోట్లతో పోకిరి 4వ స్థానంలో కొనసాగుతోంది. వీటి తర్వాత బిల్లా 85 లక్షలు, చెన్నకేశవరెడ్డి 64 లక్షలు, వర్షం 15 లక్షలతో.. ఈ రికార్డుల లిస్టులో తరువాత స్థానాల్లో ఉన్నాయి.