»   » హ్యాపీ న్యూస్ : అంతర్జాతీయంగా '1 నేనొక్కడినే'

హ్యాపీ న్యూస్ : అంతర్జాతీయంగా '1 నేనొక్కడినే'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు ఫ్యాన్స్ కి హ్యాపీ న్యూస్. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావటానికి ముస్తాబు అవుతున్న '1 నేనొక్కడినే' చిత్రం అంతర్జాతీయంగా అనేక భాషల్లో విడుదల కానుంది. . 'దూకుడు' చిత్రం తరువాత మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. సంస్థ సుకుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న '1' నేనొక్కడినే.. చిత్రం జనవరి 10న విడుదల కానుంది. ఈ చిత్రం మన దేశంతో పాటు జపాన్‌, రష్యా, అమెరికా, కొరియాల్లో ఆయా ప్రాంతీయ భాషల సబ్‌టైటిల్స్‌తో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

నిర్మాతలు మాట్లాడుతూ... ''ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాని మన దేశంతో పాటు జపాన్‌, రష్యా, అమెరికా, కొరియాల్లో ఆయా ప్రాంతీయ భాషల సబ్‌టైటిల్స్‌తో విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. లండన్‌లో రెండు నెలలపాటు చిత్రీకరించిన సన్ని వేశాలు సినిమాకి ఆకర్షణగా నిలుస్తాయి''అన్నారు

Mahesh Babu’s 1-Nenokkadine goes global

అలాగే .... తెలుగు సినీ పరిశ్రమను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఎరోస్‌ సంస్థతో చేతులు కలిపాం. సినిమా ప్రచారాన్ని సైతం వైవిధ్యంగా ఉండేలా చూసుకున్నాం. పాటల విడుదల వేడుకను థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం, మొబైల్‌ ఆప్‌లాంటివి ఇలా వచ్చినవే. ఇప్పుడు ఓ గేమ్‌ని కూడా రూపొందించాం. త్వరలో దీన్ని విడుదల చేస్తాం అని చెప్పారు.

ఇక '1' సినిమా చూసిన ప్రతి ఒక్కరు మహేష్‌ నటన గురించి, సుకుమార్‌ దర్శకత్వం గురించే మాట్లాడుకుంటారు. టాలీవుడ్‌లో చిత్రీకరించిన హాలీవుడ్‌ స్థాయి సినిమాగా '1' నిలుస్తుంది అని చెప్పుకొచ్చారు నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర. వీరు నిర్మాతలుగా తెరకెక్కించిన చిత్రం '1'. మహేష్‌బాబు, కృతిసనన్‌ జంటగా నటించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించారు. ఈ నెల 10న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.

English summary
Mahesh Babu’s 1-Nenokkadine is all set to get dubbed into foreign languages like French, Spanish, Japanese and Korean. The makers of the film are planning to release the dubbed version worldwide and if all goes well, it will be having a theatrical release by mid-2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu