Don't Miss!
- Sports
INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- News
మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Finance
High Tax: ఆ ఇన్వెస్టర్లకు ఝలక్.. టాక్స్ రేటు 5 నుంచి 20 శాతానికి పెంపు.. ఎప్పటి నుంచంటే..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Okkadu advance booking మహేష్ స్పెషల్ షోకు భారీ క్రేజ్.. ఖుషీ మూవీని మించి కలెక్షన్లు!
సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ఒక్కడు సినిమా రీ రిలీజ్‌కు అభిమానుల నుంచి భారీ స్పందన వస్తున్నది. జనవరి 7వ తేదీన ప్రదర్శించే ఈ సినిమాకు ఇటీవలే అడ్వాన్స్ బుకింగ్ కౌంటర్లు ఓపెన్ అయ్యాయి. ఎంఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి. ఒక్కడు సినిమా గురించిన వివరాలు, అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

14 కోట్ల బడ్జెట్‌తో ఒక్కడు
ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ డైరెక్షన్‌లో ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు నిర్మించిన చిత్రం ఒక్కడు. భూమికా చావ్లా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను 14 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ శేఖర్ జోసెఫ్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, మ్యూజిక్ మణిశర్మ లాంటి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేశారు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌లో రూపొందిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు.

30 కోట్ల షేర్‌తో ఇండస్ట్రీ హిట్
ఒక్కడు
చిత్రం
జనవరి
15,
2003
సంవత్సరంలో
అంచనాలు
లేకుండా
వచ్చిఇండస్ట్రీ
హిట్‌గా
నిలిచింది.
డిస్టిబ్యూటర్
షేర్
30
కోట్ల
మేర
నమోదు
చేసింది.
అప్పటి
వరకు
హిట్టు
కోసం
ఎదురు
చూస్తున్న
మహేష్
బాబుకు
ఓవర్‌నైట్
స్టార్‌డమ్
తెచ్చి
పెట్టింది.
ఆ
ఏడాది
నంది
అవార్డుల
కార్యక్రమంలో
ఎనిమిది
అవార్డులను
గెలుచు
కోవడం
విశేషంగా
మారింది.

అగ్ర హీరోల పాత సినిమాలకు క్రేజ్
ప్రస్తుతం
టాలీవుడ్‌లో
అగ్ర
హీరోల
బ్లాక్‌బస్టర్
సినిమాల
ప్రదర్శన
ఊపందుకొన్నాయి.
ఇప్పటికే
మహేష్
బాబు,
ప్రభాస్,
పవన్
కల్యాణ్,
చిరంజీవి
లాంటి
అగ్ర
నటుల
చిత్రాలను
స్పెషల్
షోలుగా
ప్రదర్శించడం
తెలుగు
సినిమా
పరిశ్రమలో
ఆనవాయితీగా
మారింది.
ఈ
చిత్రాలు
రెగ్యులర్‌గా
విడుదలయ్యే
సినిమాల
కంటే
భారీ
వసూళ్లను
సాధించడం
సెన్సేషనల్‌గా
మారింది.

పోకిరి తర్వాత ఒక్కడు స్పెషల్ షో
ఇటీవల పోకిరి సినిమాకు ఫ్యాన్స్, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మరోసారి మహేష్ బాబు అభిమానులు ఒక్కడు సినిమాను స్పెషల్ షోగా ప్రదర్శిస్తున్నారు. జూన్ 7, 8వ తేదీన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలతోపాటు, అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ షోస్ వేస్తున్నారు. ఇందుకోసం భారీగా థియేటర్లను కటౌట్లతో ముస్తాబు చేస్తున్నారు.

కేరళలో మలయాళ వెర్షన్
ఒక్కడు
సినిమాను
కేవలం
తెలుగు
రాష్ట్రాలు,
ప్రవాసాంధ్రులు
ఉండే
ప్రాంతాల్లోనే
కాకుండా
కేరళలో
కూడా
మలయాళం
వెర్షన్‌ను
ప్రదర్శించేందుకు
ఏర్పాట్లు
చేస్తున్నారు.
కేరళలోని
ముక్కంతోపాటు
ఇతర
ప్రాంతాల్లో
ఈ
సినిమాను
ప్రదర్శించేందుకు
ప్లాన్
చేశారు.
పీసీ
థియేటర్‌లో
ఈ
స్పెషల్
షో
ఉంటుందని
అభిమానులు
తెలిపారు.

అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎంతంటే?
గత రెండు, మూడు రోజుల క్రితం ప్రారంభమైన ఒక్కడు స్పెషల్ షోలకు బాక్సాఫీస్ వద్ద భారీ రెస్పాన్స్ వస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 82 లక్షల రూపాయలను వసూలు చేసింది. ఇటీవల కాలంలో రీ రిలీజ్ సినిమాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది. ఇటీవల రీ రిలీజ్ అయిన ఖుషీ సినిమా కంటే ఎక్కువ వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నారు.