»   » మహేష్ దెబ్బకు ఆ హీరోలిద్దరూ విలవిల

మహేష్ దెబ్బకు ఆ హీరోలిద్దరూ విలవిల

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ మానియా మామూలుగా లేదు. మహేష్ కొత్త చిత్రం వస్తోందంటే తెలుగులోనే మిగతా బాషల హీరోలు సైతం వణుకుతున్నారు. తాజాగా మహేష్ చిత్రం '1' (నేనొక్కడినే) దెబ్బకు అజిత్, విజయ్ విలవిల్లాడుతున్నారు . సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న '1' (నేనొక్కడినే) చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. దాంతో సంక్రాంతికి విడుదల పెట్టుకున్న విజయ్ జిల్లా, అజిత్ వీరం చిత్రాలకు కర్ణాటకలో ఎదురు దెబ్బ తగిలింది.

కర్ణాటకలో ..మహేష్ చిత్రానికి ఉన్న డిమాండ్ ఈ తమిళ హీరోలకు ఉండదనే ఉద్దేశ్యంతో డిస్ట్రిబ్యూటర్స్ చాలా తక్కువ రేటుకు ఈ తమిళ చిత్రాల రైట్స్ అడుగుతున్నారు. కర్ణాటక ఎప్పుడూ తమిళ సినిమాలకన్నా తెలుగు సినిమాలకు ముఖ్యంగా మహేష్, పవన్ కళ్యాణ్ చిత్రాలకు డిమాండ్ ఎక్కువ. దానికి తోడు చెన్నై లోనూ మహేష్ చిత్రం ఎక్కువ థియోటర్స్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతూండటం కూడా ఆ హీరోలును ఇబ్బంది పెడుతున్న అంశం.

Mahesh’s 1 Nenokkadine causes threat to Tamil heroes

ఇక '1' (నేనొక్కడినే) చిత్రం ఎపి రైట్స్ ని 55 కోట్లతో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్ధ తీసుకుంది. '1' (నేనొక్కడినే) చిత్రం ఆడియో ఘనంగా చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పెద్ద సిటీలు,టౌన్స్ లో పెద్ద స్క్రీన్స్ పై ఈ ఆడియోని లైవ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చెస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ సమయంలో ఇంట్రాక్ట్ అయ్యేలా చూస్తారు.


14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకుడు. డిసెంబరులో నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించుకొని సంక్రాంతి పండగ నాడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 'జనవరి 10న '1'ని తెచ్చేస్తున్నాం' అని మహేష్‌ కూడా చెప్పేశాడు. మహేష్‌కి సంక్రాంతి సీజన్‌ బాగా కలిసొచ్చింది 'ఒక్కడు', 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో' ముగ్గుల పండక్కి విడుదలై విజయాన్ని సాధించాయి. ఇప్పుడు '1' కూడా పండగ బరిలో దిగబోతోంది.

'1' (నేనొక్కడినే) లో మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Mahesh’s ’1 Nenokkadine’ has been adversely affecting the pre-release business of the two most awaited films of Kollywood: Ajith’s Veeram and Vijay’s Jilla.
 Both the movies are getting ready for the release during Sankrathi. Both the movies are expected to have a massive release in Tamilnadu; but, when it comes to Karnataka they are feeling a heavy threat from Mahesh Babu’s film. It is learnt that the distributors of Karnataka offered very low prices for these two Tamil films as they prefer Mahesh ‘1 Nenokkadine’ to these two Tamil movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu