»   » అఫీషియల్ : ‘సర్దార్’ & ‘బాహుబలి’ ని బీట్ చేసేసింది

అఫీషియల్ : ‘సర్దార్’ & ‘బాహుబలి’ ని బీట్ చేసేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు రెడీ చేస్తున్న ‘బ్రహ్మోత్సవం' రికార్డ్ లు వింటూంటే ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. తాజాగా ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఓ భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నారు.

అందుతున్న సమాచారం ప్రకారం 13 కోట్ల రూపాయలు ఈ చిత్రం కోసం చెల్లించినట్లు తెలుస్తోంది. ఇది పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్' మరియు రాజమౌళి ‘బాహుబలి' రికార్డ్ లును బ్రద్దలు కొట్టింది.


Mahesh's ‘BRAHMOTSAVAM’ new record

‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి 11 కోట్లుకు ఓవర్ సీస్ రైట్స్ వెళితే, ‘బాహుబలి' కు 9 కోట్లు అందాయి. ఈ విషయమై క్లాసిక్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు అఫీషియల్ గా ప్రెస్ స్టేట్ మెంట్ ఇచ్చారు.


మరో ప్రక్క ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ సైతం రీసెంట్ గా భారీ మొత్తానికి అమ్ముడైనట్లు సమచారం. ఇప్పటివరకూ మహేష్ కెరీర్ లోనే ఈ రేటు రాలేదని చెప్పుకుంటున్నారు.


జీ తెలుగు వారు ..ఓ భారీ మొత్తానికి (బయిటకు రాలేదు) ఈ రైట్స్ సొంతం చేసుకున్నట్లు సమచారం. ఇంతకు ముందు శ్రీమంతుడు చిత్రాన్ని సైతం జీ తెలుగువారే శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. శ్రీమంతుడు చిత్రంతో టీఆర్పీలు బాగా వచ్చి యాడ్ రెవిన్యూ ని బాగా సంపాదించినట్లు సమాచారం.దాంతో బ్రహ్మోత్సవంపై బాగా ఖర్చు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు.


Mahesh's ‘BRAHMOTSAVAM’ new record


శ్రీమంతుడు సినిమా ఓవరాల్ గా యుఎస్ లో 18 కోట్లకి పైనే కలెక్ట్ చేయటమే ఈ రేటు ఫిక్స్ చేయటానికి కారణం అంటున్నారు. మరో ప్రక్క ఫ్యామిలీలను టార్గెట్ చేసినట్లున్న ఈ టీజర్ కూడా ప్లస్ అయ్యింది. ఇక్కడ ఆ టీజర్ ని మరోసారి చూడండి.


ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు. మహేష్ బాబు కోసం ఈ సారి శ్రీ కాంత్ అడ్డాల విజయవాడ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు.

English summary
Reportedly Rs 13 Cr was shelled out for Brahmotsavam whereas ‘Sardaar Gabbar Singh’ and Baahubali were acquired for 11 and 9 Cr respectively.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu