»   » మహేష్ పరువుపోయినట్లే? :“బ్రహ్మోత్సవం” తీసేసి “బిచ్చగాడు”

మహేష్ పరువుపోయినట్లే? :“బ్రహ్మోత్సవం” తీసేసి “బిచ్చగాడు”

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొన్న శుక్రవారం విడుదలైన మహేష్ బాబు తాజా చిత్రం "బ్రహ్మోత్సవం" మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ టాక్ ఎంతదాకా వెళ్లిందంటే.. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. సోషల్ మీడియా, వెబ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అనే లేకుండా సినిమా చూసిన ప్రతిఒక్కరూ "సినిమా బాలేదు" అని ముక్తకంఠంతో చెబుతున్నారు.

ఆ ఎఫెక్ట్... శనివారం నుంచే "బ్రహ్మోత్సవం" ప్రదర్శిస్తున్న థియేటర్లు పై పడటం జరిగింది. ఆ ధియోటర్స్ ఏమీ హౌస్ ఫుల్ అవ్వడం లేదు. కేవలం యాభై నుంచి అరవై శాతం మాత్రమే థియేటర్లు నిండుతున్నాయి. చాలా చోట్ల బి,సి సెంటర్లలలో రెంట్లు కూడా వచ్చే పరస్దితి సోమవారం నుంచి కనపడటం లేదు.


ఈ నేపధ్యంలో చాలా చోట్ల "బ్రహ్మోత్సవం"కి బదులుగా తమిళ అనువాద చిత్రం "బిచ్చగాడు" చిత్రాన్ని తమ థియేటర్లలో ప్రదర్శించేందుకు థియేటర్ యాజమాన్యాలు రెడీ అయ్యాయి. సోమవారం నుంచి చాలా చోట్ల బిచ్చగాడు షోలు వేస్తున్నట్లు సమాచారం.'సలీమ్‌' చిత్రంతో మెప్పించిన తమిళ సంగీత దర్శకుడు, నటుడు విజయ్‌ ఆంటోనీ ఈసారి 'బిచ్చగాడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మంచి కథలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంటుందన్న నమ్మకంతో తమిళంలో ఆయన నిర్మించి, నటించిన 'పిచ్చైకారన్' మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'బిచ్చగాడు' పేరుతో చదలవాడ పద్మావతి విడుదల చేసి,విజయం సాధించారు.


విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. నేను ఏ కథ విన్నా విజువల్‌గా ఊహించుకుంటాను. 'బిచ్చగాడు' కథ విన్నప్పుడు చాలా చోట్ల కన్నీళ్లొచ్చాయి. తప్పకుండా నటించాలని నిర్ణయించుకున్నా. అసలు విషయం ఏమిటంటే.. ఈ టైటిల్‌ని చెప్పింది నేనే. దర్శకుడు శశి మొదట్లో సంకోచించారు.


చాలా మంది విమర్శించారు కూడా. బిజినెస్‌ సరిగ్గా జరగదని భయపెట్టారు. కానీ, నేనే ఫోర్స్‌ చేసి ఇదే టైటిల్‌తో సినిమా తీయాలనుకున్నా. నా నమ్మకం నిజమని తమిళ వెర్షన ఫలితం నిరూపించింది. ప్రేక్షకులు తెలివిగానే వున్నారు. మంచి సినిమాలను ఆదరిస్తున్నారు అన్నారు.

English summary
After poor weekend Brahmotsavam going drastically low at Box office. In some areas Brahmotsavam was replaced by Tamil dub film Bichagadu. Surprisngly Bichagadu flying high in AP/N .
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu