twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శ్రీమంతుడు' బెనిఫిట్ షో : టిక్కెట్లు , థియోటర్లు డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీమంతుడు'. మహేష్‌బాబు హీరో. శ్రుతి హాసన్‌ హీరోయిన్. మైత్రీ మూవీస్‌ సంస్థ తెరకెక్కించింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 7న విడుదల చేయనున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం బెనిఫిట్ షోల గురించి అప్పుడే అభిమానులు ఎంక్వైరీ మొదలెట్టారు. వారి కోసం ఇక్కడ అందుబాటులో ఉన్నంతవరకూ పూర్తి డిటేల్స్ ఇస్తున్నాం.

    మొదటి బెనిఫిట్ షో... మల్లికార్జున ధియోటర్ ...కుకుట్ పల్లిలో పడనుంది. అలాగే బెనిఫిట్ షో లు...విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ , వరంగల్, కరీంనగర్, తిరుపతి లో పడనుంది.

    శ్రీమంతుడు బెనిఫిట్ షో టిక్కెట్ రేటు ..2,500 నుంచి 4,000 వరకూ ఉండనుందని తెలుస్తోంది.

    Mahesh's Srimanthudu Benefit shows details

    'శ్రీమంతుడు' @ చెన్నై
    చెన్నై శ్రీమంతుడు బెనిఫిట్ షో లు.. @ ఆగస్టు 7న 6am కి పడనుంది.

    'శ్రీమంతుడు' @ హైదరాబాద్
    హైదరాబాద్ కుకుట్ పల్లి...బెనిఫిట్ షో టిక్కెట్ రేట్లు 1000/- , 1500/- , 2000/- ఇవి...ఉదయం నాలుగు గంటలకు పడతాయి.

    'శ్రీమంతుడు'@ వైజాగ్
    1. వైజాగ్ రామ థియోటర్ లో ఉదయం ఆరు గంటలకు బెనిఫిట్ షోలు పడతాయి. టిక్కెట్లు ఈ రోజు నుంచి దొరికే అవకాసం ఉంది. థియోటర్ దగ్గరే టిక్కెట్లు దొరుతాయంటున్నారు.
    అక్కడ మీరు కాంటక్ట్ చేయాల్సిన నెంబర్: 9603517567 @UrsCoolPrince

    మిగతా వివరాలు త్వరలో ....రానున్నాయి.

    ఇక చిత్రం విషయానికి వస్తే...

    Mahesh's Srimanthudu Benefit shows details

    'శ్రీమంతుడు' గురించి ఆసక్తిగా ఎదురుచూస్తోంది సినీ ప్రపంచం. మహేష్‌ కూడా 'ఈసారి హిట్టుకొట్టడం ఖాయం' అంటున్నారు. సినిమాపై మహేష్‌, ఆయన అభిమానులు ఎంత నమ్మకంతో ఉన్నారో, నేనూ అంతే నమ్మకంతో ఉన్నా. ఖచ్చితంగా అందరి అంచనాలూ అందుకొనేలా ఉంటుందీ చిత్రం అన్నారు కొరటాల శివ.

    ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం కృష్ణా జిల్లా రైట్స్ ని రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ తీసుకున్నట్లు ట్రైడ్ వర్గాల సమాచారం. అభిషేక్ పిక్చర్స్ వారు భాగస్వామ్యంగా ఉంటున్నారు. పోస్టర్ అండ్ పబ్లిసిటీతో కలిపి మూడు కోట్లుకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

    అలాగే...ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ మొత్తం 17 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం. అందులో తెలుగుకు 12 కోట్లు, హిందీ శాటిలైట్ రైట్స్ 5 కోట్లు అని ట్రేడ్ వర్గాల సమాచారం. జీ తెలుగు వారు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు వినికిడి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    చిత్రం గురించి కొరటాల శివ మాట్లాడుతూ... అతను అపర శ్రీమంతుడు. ధనంలో... గుణంలోను. జీవుడల్లె పుట్టి.. ఆ వూరికి దేవుడల్లె వచ్చాడు. స్నేహానికి నిర్వచనంలా, త్యాగానికి చిరునామాలా కనిపిస్తాడు. ఇక అతని అందం గురించి ఏమని చెప్పాలి? అతని నవ్వు.. ప్రేమకు చిహ్నంలా ఆకర్షిస్తుంది.

    Mahesh's Srimanthudu Benefit shows details

    కాముడు రాసిన గ్లామర్‌ డిక్షనరీలా చటుక్కున ఆకట్టుకొంటాడు. అలాంటి అబ్బాయిని ఏ అమ్మాయైనా ప్రేమించకుండా ఉంటుందా? ఓ అమ్మాయి కూడా మనసిచ్చేసింది. మరి ఆ ఇద్దరి వలపుల ప్రయాణం ఏ రీతిన సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కొరటాల శివ.

    దర్శకుడు కొరటాల శివ కంటిన్యూ చేస్తూ.. ...''మహేష్‌ లాంటి ఓ గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం ఇంత తొందరగా రావడం నా అదృష్టం. మహేష్‌ ఇమేజ్‌కి నాలుగు ఫైట్లు, పాటలు ఉంటే సరిపోదు. ఒక పెద్ద కాన్వాస్‌లో కథ ఉండాలని కష్టపడి రాశా. మహేష్‌గారికి చెప్పినప్పుడు 'ఈ కథని ఇంత కమర్షియల్‌గా చెప్పొచ్చా?' అని ఆశ్చర్యపోయారు. మహేష్‌తో ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. మహేష్‌, జగపతిబాబు తండ్రీకొడుకులుగా బాగా కుదిరారు''అన్నారు.

    నిర్మాతలు నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ మాట్లాడుతూ ''ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. మాస్‌, క్లాస్‌ తేడా లేకుండా పాటలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. అభిమానుల అంచనాలను అందుకొనేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. మహేష్‌ నటించిన చిత్రాలు తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టాయి. 'శ్రీమంతుడు'ని తమిళంలో 'సెల్వందన్‌' పేరుతో విడుదల చేస్తున్నాము''అన్నారు.

    శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ... ''ఇలాంటి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర పోషించాను''అన్నారు.

    జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, ముఖేష్‌ రుషి, తులసి, సుకన్య తదితరులు నటించారు. పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: మది

    English summary
    Mahesh Babu's upcoming release Srimanthudu is riding on high expectations. According to the latest, arrangements have been made for the benefit shows in Andhra Pradesh, Telangana and even Tamil Nadu. First benefit show will be at Mallikarjuna, Kukatpally.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X