»   »  బాలీవుడ్ కి రీమేక్ గా 'శ్రీమంతుడు'...డిటేల్స్

బాలీవుడ్ కి రీమేక్ గా 'శ్రీమంతుడు'...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సౌత్ లో ఓ సినిమా హిట్ టాక్ వచ్చిందంటే వెంటనే బాలీవుడ్ మేకర్స్ దృష్టి వాటిపై పడుతోంది. వారు వాటి రైట్స్ ని తీసుకుని అక్కడ పెద్ద హీరోలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ నుంచి వెళ్లిన సినిమాలు హిందీలో ఘన విజయం సాధించటంతో ఇలా రైట్స్ కి డిమాండ్ ఏర్పడుతోంది. తాజాగా తెలుగులో హిట్టైన శ్రీమంతుడు, కంచె చిత్రాలకు అదే కోవలం హిందీలోకి రీమేక్ అవుతున్నట్లు సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం శ్రీమంతుడు రైట్స్ ని తన వద్ద పెట్టుకున్న కొరటాల శివ...బాలీవుడ్ మేకర్స్ తో నెగోషియేషన్స్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ బేరసారాలు ఓ కొలిక్కి వచ్చి ఓ పెద్ద హీరోగా ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కనుంది.


Mahesh's Srimanthudu To Go Bollywood

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


వాస్తవానికి శ్రీమంతుడు రైట్స్ ...నిర్మాతలు వద్ద ఫిఫ్టీ పర్శంట్ ఉన్నాయి. అయితే చిత్రం ఘన విజయం సాధించటంతో దర్శకుడు మొత్తం రైట్స్ ని నిర్మాతలతో మాట్లాడి, సెటిల్ చేసుకుని తీసుకున్నారు. దాంతో ఈ చిత్రంతో హిందీలోకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడని వినికిడి.


ట్రేడ్ లో చెప్పుకునేదాన్ని బట్టి సల్మాన్ ఖాన్ లేదా హృతిక్ రోషన్ ఈ చిత్రం రీమేక్ పై ఆసక్తి చూపుతున్నట్లు చెప్తున్నారు. వీరిద్దరు డేట్స్ ఆలస్యమయితే వరుణ్ ధావన్ ఈ చిత్రం చేస్తాడని అంటున్నారు. అయితే సల్మాన్ ఈ ప్రాజెక్టుని ఫైనలైజ్ చేసే అవకాసం ఉంది.

English summary
We hear that Koratala Siva, who holds the complete rights of Srimanthudu, is keen on negotiating a good deal with Bollywood's prominent makers. If the sources are to be believed, Salman Khan or Hrithik Roshan might star in the film while Varun Dhawan is also reportedly showing great interest on the project.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu