twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లరి నరేష్...'మనం' కి సాయిం చేసాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. అక్కినేని కుటుంబం నిర్మించింది. ఈ చిత్రం మల్టిప్లెక్స్ లలో,ఎ సెంటర్లలలో, ఇతర దేశాల్లోనూ తన హవా ఇంకా చూపుతోంది. నాలుగోవారంలోనూ చిత్రం కలెక్షన్స్ స్టడీగానే ఉన్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అల్లరి నరేష్ నటించిన జంప్ జిలాని ఫ్లాఫ్ ఎఫెక్టు తో...జనాలు ఈ చిత్రం చూడటానికే ముఖ్యంగా వీకెండ్ లలో ఆసక్తిచూపుతున్నారని, దాంతో ఎక్కడా కొద్దిగా కలెక్షన్స్ డ్రాప్ అవ్వలేదని అంటున్నారు.

    మరో ప్రక్క ఈ చిత్రం లో స్వర్గీయ అక్కినేని సన్నివేశాల పై జనాలు ఆసక్తి చూపుతూండటం గమనించిన నాగార్జున... ఆయన నటించిన కొన్ని ఎగస్ట్రా సీన్స్ ని కలపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. షూట్ చేసి, సినిమా లెంగ్త్ కోసం తొలిగించిన సీన్స్ ని కలపటం ద్వారా రిపీట్ ఆడియన్స్ వస్తారని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాసం ఉంది.

    Manam Continues to lead Boxoffice

    అలాగే బాలీవుడ్ నుంచి రీమేక్ ఆఫర్స్ వచ్చాయని చెప్తున్నారు. ప్రచారంలో ఉన్నదాన్ని బట్టి... నాగార్జున పాత్రలో అమీర్ ఖాన్, నాగచైతన్య పాత్రలో రణబీర్ కపూర్ చేస్తారని, అమితాబ్...నాగేశ్వరరావు చేసిన పాత్ర చేస్తారని చెప్తున్నారు. అలాగే...ఈ రీమేక్ లో శ్రేయ పాత్రను ప్రీతిజింతా, సమంత పాత్రను కత్రినా కైఫ్ చేస్తారని చెప్తున్నారు. అయితే అమితాబ్ కుమారుడు అభిషేక్ బచ్చన్, ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ లేకుండా ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ఫిల్మ్ చేయటమేంటని అంటున్నారు.

    కాలంతోపాటు పద్ధతులు, నాగరికత వల్ల అలవాట్లు మారతాయేమో కానీ ప్రేమ మారదు. నిన్న, నేడు, రేపు.. ఎప్పుడైనా సరే. ప్రేమ ప్రేమే. అదే మా 'మనం' సారం. అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రెయహీరోయిన్స్ గా నటించారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషించారు.

    ఈ చిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

    English summary
    With Jump Jilani opening poor and getting negative talk, Manam has successfully remained as the numero uno choice of the Telugu Cinegoers this weekend too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X