twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Manchi Rojulu Vachayi Day 2 Collections: కలెక్షన్స్ లో దెబ్బ.. రెండో రోజు ఎంతంటే?

    |

    దర్శకుడు మారుతి కరోనా సమస్యను టచ్ చేస్తూ చేసిన మంచి రోజులు వచ్చాయి సినిమా దీపావళి సందర్భంగా రజనీకాంత్ పెద్దన్న, విశాల్ ఎనిమీ లాంటి సినిమాలతో పోటీ పడి రిలీజ్ చేశాడు. ఈ సినిమాతో నవ్వించే ప్రయత్నం చేస్తూనే మంచి సందేశం కూడా ఇచ్చాడు. ఇక ఈ సినిమా మొదటి రోజు భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ వచ్చాయి.

    20 రోజుల్లోనే కథ రెడీ

    20 రోజుల్లోనే కథ రెడీ

    ప్రతి రోజు పండగే సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టిన మారుతి ఆ తర్వాత వెంటనే గోపీ చంద్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలి అనుకున్నాడు. కానీ కరోనా కారణంగా తన ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చి ఇక గోపిచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేస్తూనే మరొక చిన్న సినిమా కూడా చేయాలని అప్పటికప్పుడు అనికుని మంచిరోజులు వచ్చాయి కధ సిద్ధం చేసుకున్నాడు. ఈ కథను కేవలం 20 రోజుల్లోనే రాసుకున్నాడని కూడా గతంలో వెల్లడించాడు.

    మంచి అంచనాలతో

    మంచి అంచనాలతో

    సంతోశ్‌ శోభన్, మెహరీన్ కౌర్ ఫిర్జాదా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మంచి రోజులు వచ్చాయి. కేవలం 20 రోజుల్లో కథ రాసి 30 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాను విడుదల చేశాడు మారుతి. ఒకవైపు గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తూ మధ్యలో గ్యాప్ తీసుకుని కరోనా సమయంలో మంచి రోజులు వచ్చాయి సినిమా పూర్తి చేశాడు ఈ దర్శకుడు. సాధారణంగా మారుతి సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే ముద్ర ఉంటుంది కానీ మంచి రోజులు వచ్చాయి సినిమా విషయంలో మాత్రం అలా జరగలేదు.

     ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

    ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

    యు.వి.క్రియేషన్స్ అనుబంధ సంస్థ ఈ యూవీ కాన్సెప్ట్ లో నిర్మించిన ఈ సినిమా షూటింగ్ మొత్తం కూడా ఒకే లొకేషన్లో జరిగినట్లు మారుతి చెప్పాడు. . మారుతి బ్రాండ్ ఇమేజ్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో మార్కెట్ లోకి అడుగు పెట్టింది. మరి సినిమా ఆ మేర అంచనాలు అందుకుందా? అనేది చూస్తే.

     మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్

    మొదటి రోజు వచ్చిన కలెక్షన్స్

    ఇక రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో 16 లక్షలు, సీడెడ్‌లో 7 లక్షలు, ఉత్తరాంధ్రతో 6 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 5 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 లక్షలు, గుంటూరులో 3 లక్షలు, కృష్ణా జిల్లాలో 3 లక్షలు, నెల్లూరులో 2 లక్షలు వచ్చాయి. ఆంధ్రా, నైజాంలో మొదటి రోజు 0.45 కోట్ల షేర్ రాగా టోటల్ గా 0.70 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

    మొదటి రెండు రోజులలో

    మొదటి రెండు రోజులలో


    తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా వచ్చిన షేర్ ఈ విధంగా ఉంది. నైజాంలో 48 లక్షలు, సీడెడ్‌లో 21 లక్షలు, ఉత్తరాంధ్రతో 12 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 10 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 లక్షలు, గుంటూరులో 9 లక్షలు, కృష్ణా జిల్లాలో 8 లక్షలు, నెల్లూరులో 7 లక్షలు వచ్చాయి. ఆంధ్రా, నైజాంలో మొదటి రెండు రోజులలో 1.22 కోట్ల షేర్ రాగా టోటల్ గా 2.00 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.

    Recommended Video

    Manchi Rojulochaie Movie Team Theatre Visit | Blockbuster Celebrations
    ప్రపంచం వ్యాప్తంగా వచ్చిన వసూళ్ళు

    ప్రపంచం వ్యాప్తంగా వచ్చిన వసూళ్ళు

    రెండు రోజులకు కలిపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో 1.22 కోట్ల షేర్ అందుకున్న మంచి రోజులు వచ్చాయి సినిమా కర్ణాటక తో పాటు మిగతా రాష్ట్రాలలో కేవలం ఆరు లక్షల మాత్రమే షేర్ మాత్రమే అందుకుంది. ఓవర్సీసీస్ లో ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రాలేవు. అక్కడ కేవలం పది లక్షల షేర్ మాత్రమే వచ్చాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటిరోజు 1.38 కోట్ల షేర్ రాగా 2.35 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

    English summary
    Manchi Rojulu Vachayi Day 2 box office Collections are here
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X