twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mosagallu closing collections: 50కోట్లు పెడితే మొత్తం వచ్చింది ఇంతేనా.. కలలో కూడా ఊహించి ఉండరు

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం చాలా కాలంగా కష్టపడుతున్న వారసుల్లో మంచు విష్ణు ఒకరు. మార్చి 19న మోసగాళ్ళు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక థియేటర్స్ వద్ద సినిమా పోరాటం ముగిసింది. సినిమా బిజినెస్ పరంగా సగంలో సగం కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. ఇక మొత్తంగా వచ్చిన క్లోజింగ్ కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

    50కోట్ల బడ్జెట్ ..

    50కోట్ల బడ్జెట్ ..

    మోహన్ బాబు వారసత్వం నుంచి వచ్చినప్పటికీ విష్ణు కొన్ని సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నడు. అప్పట్లో వచ్చిన డీ సినిమా అతని కెరీర్ లో బిగెస్ట్ హిట్. మధ్యమధ్యలో కొన్ని కమర్షియల్ హిట్స్ వచ్చాయి గాని అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. ఇక మోసగాళ్ళు సిమిమతో విష్ణు మొదటిసారి భారీ బడ్జెట్ తో రిస్క్ చేశాడు. సినిమా కోసం 50కోట్ల బడ్జెట్ పెట్టినట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

    పాన్ ఇండియా సినిమాగా

    పాన్ ఇండియా సినిమాగా

    మోసగాళ్ళు సినిమాను ఒక వరల్డ్ బిగెస్ట్ మనీ స్కామ్ ఆధారంగా తెరలెక్కించారు. సినిమాను హాలీవుడ్ టెక్నీషియన్ జెఫ్రీ తెరకెక్కించగా మంచు విష్ణు తన హోమ్ ప్రొడక్షన్ లో నిర్మించారు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ మలయాళం భాషల్లో పాన్ ఇండియా సినిమగా రిలీజ్ చేశారు.

    ముందుగానే 30కోట్లు..

    ముందుగానే 30కోట్లు..

    ఇక మిక్సీడ్ టాక్ అందుకున్న ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మొదటి రోజు నుంచి పెద్దగా ఏమి సంతృప్తిని అయితే ఇవ్వలేదు. సినిమాను 50కోట్ల బడ్జెట్ తో నిర్మించగా నాన్ థియేట్రికల్ గా అన్ని భాషల్లో కలుపుకొని 30కోట్ల వరకు రికవరీ చేయగలిగింది. సినిమాకు అదొక్కటే సంతోషాన్ని ఇచ్చే విషయం.

    ఏరియాలా వారిగా క్లోజింగ్ కలెక్షన్స్..

    ఏరియాలా వారిగా క్లోజింగ్ కలెక్షన్స్..

    మోసగాళ్ళు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అందుకున్న కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం 28లక్షలు, సీడెడ్ 14లక్షలు, ఉత్తరాంధ్ర 10లక్షలు, ఈస్ట్ 8లక్షలు, వెస్ట్ 4లక్షలు, గుంటూరు 7లక్షలు, కృష్ణ 7లక్షలు, నెల్లూరు 3లక్షలు.. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం వచ్చిన షేర్ 0.81కోట్లు. గ్రాస్ 1.54కోట్లు

    మొత్తం వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే..

    మొత్తం వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే..

    ఇక రిలీజ్ చేయడానికి ఎవరు ముందుకి రాకపోవడంతో హీరో విష్ణు సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. 20కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో సినిమాను మార్కెట్ లోకి విడుదల చేయగా.. ఫైనల్ గా తెలుగు రాష్ట్రాల్లో 0.81కోట్ల షేర్ ను మాత్రమే అందుకుంది. వరల్డ్ వైడ్ గా 0.99షేర్ వచ్చినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా కేవలం 1.99గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

    ముందుగానే ఇన్సూరెన్స్

    ముందుగానే ఇన్సూరెన్స్

    సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 21కోట్లయితే కనీసం సగంలో సగం కూడా రాకపోవడం భారీ దెబ్బ అనే చెప్పాలి. అంటే 20.01కోట్ల వరకు నష్టపోయింది. అయితే సినిమాకు మంచు విష్ణు ముందే ఇన్సురెన్స్ చేయించినట్లు చెప్పాడు. అంటే నష్టాల నుంచి కొంతవరకు తప్పించుకోవచ్చని సమాచారం. ఏదేమైనా మోసగాళ్ళు సినిమాను భారీ స్టౌయిలో హిట్ కొట్టాలని అనుకున్న విష్ణు ఊహించని ఫలితాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

    English summary
    It is a known fact that back-to-back movies are being released again in the Tollywood industry. Producers who had a lot of trouble due to the corona lock-down bravely released the films as a whole. However, if some of the films hit, other films are receiving outrageous collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X