twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దొందూ దొందే..ప్రేక్షకులకి బాదుడే (ట్రేడ్ టాక్)

    By Srikanya
    |

    క్రిందటివారం మహాశివరాత్రి రోజున రెండు చిత్రాలు ప్రేక్షకుల ముంగిట్లో వాలాయి.అవి చార్మి 'మంగళ", నరేష్-శ్రీహరిల 'అహనా పెళ్లంట".వీటితో పాటు మాధవన్ నటించిన మరో డబ్బింగ్ చిత్రం 'క్రోధం"కూడా రిలైజైంది.వీటిల్లో ఏది ప్రేక్షకుడుని రంజింప చేయలేకపోయాయి.ముఖ్యంగా చార్మి 'మంగళ" విషయానికొస్తే..దర్శకుడు ఓషో తులసీరామ్ 'మంగళ"ని తీర్చి దిద్దిన విధానం ప్రేక్షకులను అసహనానికి గురిచేస్తోంది.గతంలో 'మంత్ర"ని తెరకెక్కించి అందరినీ మెప్పించిన తులసీరామ్ ఇలాంటి నాసిరకం చిత్రంతో వస్తారని ఎవరూ ఊహించలేదు.చార్మి చేసిన ఐస్ ..ఐస్ సాంగ్ తప్ప ఇందులో చూడ్డా నికి ఏమీలేదని,భయపెట్టే సన్నివేసాల్లోనూ చార్మి అందాల ఎక్సపోజింగ్ చేయటం దర్శకుడు చీప్ టేస్ట్ గు ఎలాగోలా గట్టెక్కాలి అనే ఆలోచనకు ప్రతిబింబమని అంటున్నారు.ఓషో తులసీరామ్ రెండో చిత్ర గండం దాటలేకపోయాడని నిర్దారించాడు. ఇక హిందీ చిత్రాల కలగూర గంపగా మారి విడుదలైన అల్లరి నరేష్ 'అహ నా పెళ్లంట"ఓపినింగ్స్ బాగానే తెచ్చుకున్నా నిలబెట్టుకునే స్ధితిలో లేదు.ఈ చిత్రంతో కొత్తగా పరిచయమైన దర్శకుడు వీరభద్రమ్ ఫస్ట్ హాఫ్ ఈ చిత్రాన్ని బాగానే నడిపించినా సెకెండాఫ్ కి వచ్చేసరికి చతికిలపడ్డాడు.రెండవ సగంలో సరైన కథ లేక చూసే ప్రేక్షకులకు కాస్త బోర్‌గానే అనిపిస్తోంది.ఇక మాధవన్ నటించిన 'క్రోధం" ఓ వృథా ప్రయత్నమే అని చెప్పవచ్చు.తమిళంలో విడుదలైన ప్రతీ చిత్రాన్ని డబ్బింగ్ పేరుతో తెలుగులోకి తోసే ప్రయత్నం వృధానే అని మరోసారి నిరూపించింది.

    English summary
    Last week releases Aha Naa pellanta, Mangala finally settled with flop talk. Another dubbing film Krodham(Madhavan)makes no impact at Box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X