Don't Miss!
- News
బెంగళూరులో సరికొత్త `సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా`: ముఖ్యమంత్రి ప్రకటన
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Masooda Total Collections: మసూద సంచలనం.. బిజినెస్‌కు 4 రెట్లు వసూళ్లు.. అన్ని కోట్ల లాభాలతో రికార్డు
సినీ రంగంలో మిగిలిన జోనర్ల కంటే హర్రర్ థ్రిల్లర్ మూవీలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంటుంది. అందుకే ఆ తరహా చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకుంటూ ఉంటాయి. అయితే, ఈ మధ్య కాలంలో అలాంటి సినిమాల్లో కామెడీని పెట్టేసి గాడి తప్పిస్తున్నారు. దీంతో వాటికి ఆదరణ తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్యూర్ థ్రిల్ కాన్సెప్టుతో వచ్చిన హర్రర్ మూవీనే 'మసూద'. వినూత్నమైన సబ్జెక్టుతో రూపొందిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'మసూద' మూవీ ఫుల్ రన్‌లో ఎంత రాబట్టిందో లుక్కేద్దాం పదండి!

మసూదతో వాళ్లంతా వచ్చారు
సీనియర్ హీరోయిన్ సంగీత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రమే 'మసూద'. సాయి కిరణ్ తెరకెక్కించిన ఈ మూవీలో తిరువీర్, కావ్య కల్యాణ్‌రామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతాన్ని అందించారు. శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, శ్రీధర్, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో నటించారు.
Anchor Vishnupriya: ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన యాంకర్.. అబ్బో ఏం వేసినా అరాచకమే!

మసూద బిజినెస్ వివరాలు
మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఆదరణ దక్కుతోంది. ఈ నమ్మకంతోనే 'మసూద' మూవీ థియేట్రికల్ హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల రైట్స్‌ను కలిపి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రూ. 1.30 కోట్లకు కొనుగోలు చేశారు. అందుకు అనుగుణంగానే రిలీజ్ చేశారు.

అలాంటి టాక్‌తోనే వసూళ్లు
క్రేజీ కాన్సెప్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'మసూద' మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి టాక్ వచ్చింది. దీంతో దీనికి కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ సినిమా కేవలం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభావాన్ని చూపించింది. దీంతో అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా విశేషమైన వసూళ్లను రాబట్టింది.
నీ భార్యతో ఎన్నిసార్లు ఆ పని చేశావ్.. లైవ్‌లోనే ఆమెకు ఫోన్ కాల్.. అవినాష్ పరువు తీసిన శ్రీముఖి

తెలుగులో మొత్తం కలెక్షన్స్
చాలా చిన్న బడ్జెట్‌తోనే వచ్చిన 'మసూద' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీగా వచ్చాయి. దీంతో ఇది రెండు మూడు రోజుల్లోనే టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది. ఫుల్ రన్‌లో ఈ మూవీ నైజాంలో రూ. 6.13 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.03 కోట్లు, ఆంధ్రా మొత్తంలో రూ. 4.01 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా మొత్తంగా రూ. 11.17 కోట్లు గ్రాస్, రూ. 6.02 కోట్లు షేర్ రాబట్టింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు
ఫుల్ రన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 11.17 కోట్లు గ్రాస్‌ను రాబట్టిన 'మసూద' మూవీ.. ప్రపంచ వ్యాప్తంగానూ కొంతమేర ప్రభావాన్ని చూపించిందని చెప్పుకోవచ్చు. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో కలిపి దీనికి రూ. 55 లక్షలు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఫుల్ రన్‌లో రూ. 11.72 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 6.26 కోట్లు షేర్‌ను వచ్చింది.
మళ్లీ రెచ్చిపోయిన కేతిక శర్మ.. చాలీ చాలని బట్టల్లో అందాల ప్రదర్శన

మూవీక అన్ని కోట్ల లాభాలు
హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్టుతో వచ్చిన 'మసూద' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.30 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 1.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ముగింపు సమయానికి రూ. 6.26 కోట్లు వసూలు చేసింది. అంటే.. ఈ సినిమాకు హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.76 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

ఆహాలో రికార్డు స్థాయి వ్యూస్
'మసూద' మూవీ నవంబరు 18న థియేటర్లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో దాదాపు రెండు వారాల పాటు సందడి చేసి భారీ వసూళ్లను రాబట్టింది. ఇక, డిసెంబర్ 21 నుంచి 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో రికార్డు వ్యూస్ కూడా దక్కుతోన్నాయి.