Mass Jathara Day 1 Collections: బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర రచ్చ..రవితేజ మూవీ తొలి రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
Mass Jathara Collections: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న సమయంలో వచ్చిన చిత్రం 'మాస్ జాతర (Mass Jathara)'. వరుస ఫ్లాప్స్‌తో కెరీర్ టఫ్ ఫేజ్‌లో ఉన్న రవితేజకు ఈ సినిమా చాలా కీలకం."వాల్తేర్ వీరయ్య", "రావణాసుర", "టైగర్ నాగేశ్వరరావు", "మిస్టర్ బచ్చన్" వరుసగా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో రవితేజ మరోసారి ప్రేక్షకుల మనసులు గెలవాలన్న ఆశతో 'మాస్ జాతర' అనే టైటిల్‌తో మాస్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.ఈ నేపథ్యంలో అక్టోబర్ 31న విడుదలైన మాస్ జాతరకు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు (1వ రోజు) ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
రవితేజ 75వ సినిమా - భారీ అంచనాలు
'మాస్ జాతర' రవితేజ కెరీర్‌లో 75వ చిత్రం కావడం ప్రత్యేకత. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాతలుగా సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య వ్యవహరించారు. డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వం బాధ్యతలు చేపట్టగా, కెమెరా విదు అయ్యన్న, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా రవితేజ సరసన నటించగా, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, హైపర్ ఆది, ప్రవీణ్, హిమజ, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మాస్ జాతర బడ్జెట్ & ప్రీ రిలీజ్ బిజినెస్
"మాస్ జాతర" షూటింగ్ హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు అందమైన లొకేషన్లలో జరిగింది. నిర్మాణ విలువల్లో ఎక్కడా తగ్గని ఈ సినిమాకు సుమారు ₹90 కోట్ల బడ్జెట్ ఖర్చు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్‌ను కలిపి ఈ సినిమా సుమారు ₹30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ మాత్రమే ₹25 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. ఇందులో నైజాం రూ. 10 కోట్లు, సీడెడ్ రూ.3.5 కోట్లు, ఆంధ్ర రూ.11.5 కోట్లు, మొత్తం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ రూ.25 కోట్లకు చేరింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ రూ. 2 కోట్లు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ₹3 కోట్లు కలిపి వరల్డ్ వైడ్ బిజినెస్ రూ 30 కోట్లకు చేరింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్ షేర్ రూ. 32 కోట్లు, గ్రాస్ కలెక్షన్స్ రూ. 65 కోట్లు దాటాలి అని ట్రేడ్ అనలిస్ట్‌లు పేర్కొంటున్నారు.
తొలి రోజు కలెక్షన్స్
రవితేజ "మాస్ జాతర" నిన్న (అక్టోబర్ 31) సాయంత్రం ప్రీమియర్ షోలతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు (నవంబర్ 1) నుండి రెగ్యులర్ షోలు ప్రారంభమయ్యాయి.మాస్ జాతర సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్ట్ హాఫ్‌లోని కామెడీ సీక్వెన్సులు, రవితేజ ఎనర్జీ బాగున్నప్పటికీ, సెకండ్ హాఫ్ డ్రామా సద్దుమణిగిందని అభిప్రాయపడ్డారు. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి స్థాయిలో ఉన్నప్పటికీ, కథనం పాత పంథాలోనే సాగిందని విమర్శలు వచ్చాయి. అయితే శ్రీలీల గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు మైనస్ కాకుండా ప్లస్‌గా మారిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో మాస్ జాతర సినిమా మొదటి రోజు వసూళ్లపై ఆసక్తి నెలకొంది. ప్రీమియర్ షోల నుంచే కలెక్షన్ల హంగామా మొదలైందనీ, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో మాస్ జాతర ప్రీమియర్లతో రూ.5 కోట్ల గ్రాస్ సాధించిందని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. కానీ ఈ ఫిగర్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే సినిమా థియేటర్లలో టికెట్ రేట్లు పెంచలేదు, అలాగే ప్రీమియర్ షోలు కూడా అంతగా హౌస్‌ఫుల్ కాలేదని చెబుతున్నారు.
మాస్ జాతర తొలి రోజు కలెక్షన పరంగా చూస్తే.. మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం ఊహించని స్థాయిలో తక్కువగా నమోదయ్యాయి. సాక్నిల్క్ నివేదికల ప్రకారం.. 'మాస్ జాతర' డే 1 ఇండియా నెట్ కలెక్షన్ రూ. 2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల మధ్యలోనే వసూలు అయ్యే అవకాశముంది. ఇది రవితేజ స్థాయి స్టార్‌కు చాలా తక్కువ ఓపెనింగ్. ఇక వరల్డ్ వైడ్‌గా చూస్తే సినిమా తొలి రోజు ₹3 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. రవితేజ మిస్టర్ బచ్చన్ మొదటి రోజు ₹5.3 కోట్లు వసూలు చేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ సినిమా ప్రదర్శన చాలా నిరాశపరిచే స్థాయిలో ఉంది. మౌత్ టాక్ ఏమైనా మారితే.. కలెక్షన్లు పెరిగే అవకాశముందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక వీకెండ్‌లో రిజల్ట్ ఏవిధంగా మారుతుందో అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











