Mass Jathara Day 2 Collections: మాస్ జాతర షాకింగ్ కలెక్షన్స్.. రవితేజ మూవీ 2వ రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
Mass Jathara Collections: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన కెరీర్‌లో ఓ కీలక దశలో ఉన్నాడు. వరుసగా వచ్చిన ఫ్లాప్స్‌తో కొంత వెనుకబడిన రవితేజకు ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడం తప్ప మరో మార్గం లేదు. "వాల్తేర్ వీరయ్య", "రావణాసుర", "టైగర్ నాగేశ్వరరావు", "మిస్టర్ బచ్చన్" చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవలేదు. ఈ క్రమంలోనే రవితేజ తన ఎనర్జీ, మాస్ యాక్షన్ స్టైల్‌కి సరిపోయే విధంగా "మాస్ జాతర" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31న విడుదలైన మాస్ జాతరకు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 2వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
"మాస్ జాతర" రవితేజ కెరీర్‌లో 75వ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించారు. డైరెక్టర్ భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. టెక్నికల్ టీమ్‌లో కెమెరామన్ అయ్యన్న, ఎడిటర్ నవీన్ నూలి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో వంటి ప్రముఖులు ఉన్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, హైపర్ ఆది, హిమజ, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

భారీ బడ్జెట్ - ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో
"మాస్ జాతర" సినిమాను హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ సినిమాను దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు కలిపి మొత్తం రూ. 30 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ మాత్రమే ₹25 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. నైజాం ప్రాంతానికి రూ. 10 కోట్లు, సీడెడ్ రూ. 3.5 కోట్లు, ఆంధ్ర ప్రాంతానికి రూ. 11.5 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ రూ. 2 కోట్లు, ఓవర్సీస్ హక్కులు రూ.3 కోట్లకు అమ్ముడైంది. ఇలా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 30 కోట్లకు చేరింది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్ షేర్ రూ. 32 కోట్లు, గ్రాస్ కలెక్షన్స్ రూ. 65 కోట్లను దాటాలని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.
సాలిడ్ ఓపెనింగ్!
"మాస్ జాతర" అక్టోబర్ 31 సాయంత్రం ప్రీమియర్ షోలతో ప్రారంభం కాగా, నవంబర్ 1 నుంచి రెగ్యులర్ షోలు ప్రారంభమయ్యాయి. సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సీక్వెన్స్, రవితేజ ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకోగా, సెకండ్ హాఫ్ డ్రామా అంతగా మెప్పించలేకపోయిందనే విమర్శలు వచ్చాయి. అయితే శ్రీలీల గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ నేపథ్యంలో మాస్ జాతర ప్రీమియర్ షోల నుంచే మంచి కలెక్షన్లు అందుకుంది.
ఈ క్రమంలో ప్రీమియర్ షోల ద్వారా రూ. 2.9కోట్లు నెట్ కలెక్షన్ అందుకుంది. కానీ నిర్మాతలు వెల్లడించిన ప్రకారం గ్రాస్ కలెక్షన్ ₹5 కోట్లు దాటాయి. ఈ మేరకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. ఇక వీకెండ్ కావడంతో తొలిరోజు కలెక్షన్స్ కూడా మెరుగుపడ్డాయి. సాక్నిల్క్ నివేదికల ప్రకారం.. తొలిరోజు ఇండియా నెట్ కలెక్షన్ రూ. 3.75 కోట్లు, వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 4.5 కోట్ల వరకు నమోదైంది.
జోరందుకున్న మాస్ జాతర!
రెండవ రోజు నుండి సినిమా వసూళ్లు పుంజుకున్నాయి. ఉదయం షో 19.27 శాతం, మధ్యాహ్నం షో 22.5 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. ఈ వేగం కొనసాగితే ఈ వీకెండ్‌లో థియేటర్ ఆక్యుపెన్సీ మరింత పెరుగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండవ రోజు ఇండియా నెట్ కలెక్షన్ రూ. 3.5 నుంచి 4 కోట్ల మధ్య ఉండవచ్చని, వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 4 కోట్లకు చేరవచ్చని సమాచారం. మొత్తం రెండు రోజుల కలెక్షన్లు రూ. 8.5 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం సినిమా మౌత్ టాక్ మిశ్రమంగానే ఉన్నా, రవితేజ మాస్ ఇమేజ్, ఎనర్జీ, పాటలు, కామెడీ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి.ఈ వారం మొత్తం సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటే.. రెండో వారం చివరికి బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేయవచ్చని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇంకా రవితేజకు హిట్ అందుకున్నారా? లేదా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.


Click it and Unblock the Notifications











