Mass Jathara Day 3 Collections: బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర జోష్.. రవితేజ మూవీ 3వ రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?

Mass Jathara Collections: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన కెరీర్‌లో క్లిష్ట దశలో ఉన్నాడు. ఒకప్పుడు బాక్సాఫీస్‌ను కుదిపేసే హిట్ మెషీన్‌గా పేరొందిన రవితేజ, గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్స్ ను ఎదుర్కొంటున్నాడు. వాల్తేర్ వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో ఆయన అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఈ పరిస్థితుల్లో రవితేజ తన ఇమేజ్‌కి సరిపోయే పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ "మాస్ జాతర" తో ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 31న విడుదలైన మాస్ జాతరకు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 2వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

"మాస్ జాతర" రవితేజ కెరీర్‌లో 75వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ వంటి ప్రముఖ బ్యానర్లు కలిసి నిర్మించారు. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ ప్రాజెక్ట్‌పై భారీగా పెట్టుబడి పెట్టారు. యువ దర్శకుడు భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఆయన స్టైల్‌లో మాస్ ఎలిమెంట్స్, కామెడీ, సెంటిమెంట్ మేళవింపు ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు ఆకర్షిస్తోంది.

Mass Jathara Day 3 Expected Box Office Collections

టెక్నికల్ టీమ్‌లో విషయానికి వస్తే.. కెమెరామన్ అయ్యన్న అద్భుతమైన విజువల్స్ అందించగా, ఎడిటర్ నవీన్ నూలి సినిమాను రకరకాల పేస్‌లతో చక్కగా కట్ చేశారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో రవితేజ ఎనర్జీకి సరిపోయే మాస్ బీట్‌లతో సినిమాకు కొత్త జోష్ ఇచ్చారు. హీరోయిన్‌గా శ్రీలీల నటించగా, ఆమెతో రవితేజ జంట కొత్తగా, ఆకర్షణీయంగా కనిపించింది. అలాగే నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, హైపర్ ఆది, హిమజ, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాను దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు అందమైన లొకేషన్లలో షూటింగ్ జరిగింది. బడ్జెట్‌తోపాటు, సినిమా బిజినెస్ కూడా విశేషంగా జరిగింది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ కలిపి మొత్తం రూ. 30 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ మాత్రమే రూ. 25 కోట్లకు అమ్ముడవగా, రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ రూ. 2 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 3 కోట్లకు అమ్ముడవడంతో, మొత్తం వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 30 కోట్లకు చేరింది. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ దృష్ట్యా, సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్ షేర్ రూ. 32 కోట్లు, గ్రాస్ కలెక్షన్ రూ. 65 కోట్లను దాటాలని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

ఫస్ట్ షో నుంచి మిక్స్డ్ టాక్
"మాస్ జాతర" అక్టోబర్ 31 సాయంత్రం ప్రీమియర్ షోలతో ప్రారంభం కాగా, నవంబర్ 1 నుంచి రెగ్యులర్ షోలు ప్రారంభమయ్యాయి. సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సీక్వెన్స్, రవితేజ ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకోగా, సెకండ్ హాఫ్ డ్రామా అంతగా మెప్పించ లేకపోయిందనే విమర్శలు వచ్చాయి. అయితే శ్రీలీల గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ నేపథ్యంలో మాస్ జాతర ప్రీమియర్ షోల నుంచే మంచి కలెక్షన్లు అందుకుంది.

ప్రీమియర్ షోల నుంచే "మాస్ జాతర" మంచి కలెక్షన్లు రాబట్టింది. ప్రారంభంగా సినిమా రూ. 2.9 కోట్లు నెట్ కలెక్షన్, రూ.5 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రత్యేక పోస్టర్‌ ద్వారా ఈ అంచనాలను అధికారికంగా వెల్లడించింది. వీకెండ్ ఫ్యాక్టర్ వల్ల సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద మంచి ఊపు అందుకుంది. సాక్నిల్క్ నివేదికల ప్రకారం.. తొలిరోజు ఇండియా నెట్ కలెక్షన్ రూ. 3.75 కోట్లు, వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.4.5 కోట్ల వరకు నమోదైంది. ఇక రెండో రోజు కూడా ఊపు కొనసాగింది. దీంతో 2వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ రూ.2.64 కోట్లకు చేరుకున్నాయి.

ఇక మూడవ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. వర్కింగ్ డే కాబట్టి రవితేజ సినిమా వసూళ్లు తగ్గాయి. ఉదయం షో 14.27 శాతం, మధ్యాహ్నం షో 18.5 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. ఈ పరిస్థితిని చూస్తే సాయంత్రం, రాత్రి థియేటర్ ఆక్యుపెన్సీ కూడా సాధారణ ఆక్యూపెన్సీ ఉండే అవకాశముంది. ట్రేడ్ వర్గాలు అంచనా ప్రకారం మూడో రోజు ఇండియా నెట్ కలెక్షన్ రూ.1 కోటి నుంచి 1.5 కోట్ల మధ్య ఉండవచ్చని, వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 2 కోట్లకు చేరవచ్చని సమాచారం. మొత్తం మూడు రోజుల కలెక్షన్లు రూ. 10 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.

సినిమా మౌత్ టాక్ మిశ్రమంగానే ఉన్నా, రవితేజ మాస్ ఇమేజ్‌, ఎనర్జీ, పాటలు, కామెడీ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. ట్రేడ్ అనలిస్టుల ప్రకారం, ఈ వారం సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తే, రెండో వారం చివరికి బ్రేక్ ఈవెన్ చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా బీ & సీ సెంటర్లలో రవితేజ సినిమాలకు ఉన్న పట్టు "మాస్ జాతర"కు కూడా మద్దతుగా నిలుస్తోంది. ఇంకా మాస్ రాజా సినిమాతో రవితేజ హిట్ అందుకున్నారా? లేదా? అనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X