Mass Jathara Day 4 Collections: ‘మాస్ జాతర’ ఎదురీత.. రవితేజ మూవీ 4వ రోజు కలెక్షన్ ఎన్ని కోట్లంటే?
Mass Jathara Collections: టాలీవుడ్ మహారాజా రవితేజ.. ఒకప్పుడు ఆయన హిట్ మెషీన్ గా గుర్తింపు పొందారు. కానీ, గత కొంతకాలంగా ఆయన కెరీర్‌లో ఊహించని క్లిష్ట దశ కొనసాగుతోంది. వరుస సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వాల్తేర్ వీరయ్య, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, మిస్టర్ బచ్చన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ తన మాస్ ఇమేజ్‌ను మళ్లీ రీబూట్ చేసుకోవడానికి 'మాస్ జాతర' అనే ప్యూర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో మాస్ జాతరకు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 4వ రోజు ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..
"మాస్ జాతర" రవితేజ కెరీర్‌లో 75వ సినిమా కావడం విశేషం. ఈ భారీ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ వంటి ప్రముఖ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య ఈ ప్రాజెక్ట్‌పై సుమారు రూ. 90 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు. యువ దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ, యాక్షన్ కాంబోగా నిర్మించబడింది. భాను భోగవరపు ఇప్పటికే రచయితగా "కృష్ణార్జున యుద్ధం", "ప్రేమ కధా చిట్ట్రమ్" వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా మాస్ జాతర ద్వారా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రవితేజ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ కలయిక స్క్రీన్‌పై స్పార్క్ లాగా కనిపించింది. సపోర్టింగ్ కాస్ట్‌లో నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, హైపర్ ఆది, హిమజ, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్ వంటి నటులు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు. టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అయ్యన్న, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు. భీమ్స్ అందించిన మాస్ బీట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రవితేజ ఎనర్జీకి సరిగ్గా సరిపోయాయి. ప్రత్యేకించి టైటిల్ సాంగ్ , ఇంట్రో సాంగ్ థియేటర్లలో ఫ్యాన్స్ పండగలా మార్చాయి.
మాస్ జాతర సినిమా బడ్జెట్ సుమారు రూ. 90 కోట్లు, ఇందులో సెట్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌లు, సాంగ్స్ కోసం భారీ ఖర్చు చేశారు. బిజినెస్ విషయానికి వస్తే, థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులు కలిపి సినిమా సుమారు రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ రూ. 25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ రూ. 2 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 3 కోట్లకు అమ్ముడవడంతో సినిమా బాక్సాఫీస్ దృష్ట్యా మంచి బిజినెస్ సాధించింది. ట్రేడ్ అనలిస్టుల ప్రకారం.. సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే వరల్డ్ వైడ్ షేర్ రూ. 32 కోట్లు, గ్రాస్ కలెక్షన్ రూ. 65 కోట్లను దాటాలి.
ఫస్ట్ షో నుంచే హంగామా
"మాస్ జాతర" అక్టోబర్ 31 సాయంత్రం ప్రీమియర్ షోలతో ప్రారంభమైంది. థియేటర్లలో ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. నవంబర్ 1 నుంచి రెగ్యులర్ షోలు మొదలయ్యాయి. మొదటి రోజు నుంచే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా, రవితేజ ఫ్యాన్స్ కు మాత్రం సెలబ్రేషన్ గానే మారింది. ఫస్ట్ హాఫ్‌లో రవితేజ ఎనర్జీ, కామెడీ సీక్వెన్స్, శ్రీలీల గ్లామర్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశాయి. కానీ సెకండ్ హాఫ్‌లో కథ కొంత సీరియస్ టోన్ తీసుకోవడంతో మాస్ ఆడియెన్స్ కొంత నిరుత్సాహానికి గురయ్యారనే రిపోర్ట్స్ వచ్చాయి.
"మాస్ జాతర" ప్రీమియర్ షోల నుంచే మంచి కలెక్షన్లు రాబట్టింది. సాక్నిల్క్ నివేదికల ప్రకారం.. ప్రీమియర్ షోల నుంచి రూ. 2.9 కోట్లు నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. కానీ, ప్రీమియర్స్ ద్వారా రూ.5 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రత్యేక పోస్టర్‌తో అధికారికంగా వెల్లడించింది. ఇక వీకెండ్ ఫ్యాక్టర్ వల్ల సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద మంచి ఊపు అందుకుంది. సాక్నిల్క్ నివేదికల ప్రకారం.. తొలిరోజు ఇండియా నెట్ కలెక్షన్ రూ.4.2 కోట్లు, రెండో రోజు రూ.3.15 కోట్లు, మూడో రోజు 1.16 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో మాస్ జాతర మూవీ మూడు రోజుల్లో రూ. 12 కోట్ల వరకు వసూలు చేసింది.
ఇక నాలుగో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. వర్కింగ్ డే కాబట్టి రవితేజ సినిమా వసూళ్లు చాలా తగ్గాయి. ఉదయం షో 14.27 శాతం, మధ్యాహ్నం షో 18.5 శాతం ఆక్యూపెన్సీ నమోదైంది. ఈ పరిస్థితిని చూస్తే సాయంత్రం, రాత్రి థియేటర్ ఆక్యుపెన్సీ కూడా సాధారణ ఆక్యూపెన్సీ ఉండే అవకాశముంది. ట్రేడ్ వర్గాలు అంచనా ప్రకారం నాలుగో రోజు ఇండియా నెట్ కలెక్షన్ రూ.1 కోటి నుంచి 1.2 కోట్ల మధ్య ఉండవచ్చని, వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 2 కోట్లకు చేరవచ్చని సమాచారం. మొత్తం మాస్ జాతర కలెక్షన్స్ రూ.13 కోట్లకు చేరువ కానున్నట్టు ట్రేడ్ వర్గాల అంచనా.
సినిమా మౌత్ టాక్ మిశ్రమంగానే ఉన్నా, రవితేజ మాస్ ఇమేజ్, ఎనర్జీ, పాటలు, కామెడీ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటున్నాయి. ట్రేడ్ అనలిస్టుల ప్రకారం ఈ వారం సినిమా సాలిడ్ కలెక్షన్లు సాధిస్తే, రెండో వారం చివరికి బ్రేక్ ఈవెన్ చేరే అవకాశం ఉంది. ఇంకా మాస్ జాతర సినిమాతో రవితేజ కెరీర్ లో హిట్ అందుకున్నారా? లేదా? అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











