»   »  మహేష్ కు మెగా కౌంటర్

మహేష్ కు మెగా కౌంటర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు కి మెగా కౌంటర్ ఇవ్వటానికి రంగం సిద్దమవుతోందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. మహేష్ తాజా చిత్రం 'ఆగడు' రిలీజ్ సమయానికి మెగా హీరోలు ఇద్దరూ తమ చిత్రాలు పూర్తి చేసి, రిలీజ్ సిద్దం చేస్తున్నారు. ఆ రెండు చిత్రాలు గోవిందుడు అందరి వాడేలే, గొల్లభామ. దసరా సందర్భంగా సెప్టెంబర్ 19న కానీ సెప్టెంబర్ 26న కానీ 'ఆగడు' ని విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. అయితే అదే సమయానికి రెండు చిత్రాలు వస్తున్నాయని ట్రేడ్ టాక్. దాంతో థియోటర్ ల వద్ద సమస్య వచ్చే అవకాసం ఉందంటున్నారు.

గోవిందుడు అందరివాడేలా చిత్రాన్ని రామ్ చరణ్ హీరోగా కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్నారు. అలాగే గొల్లభామ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలకూ మంచి క్రేజ్ ఉందనే విషయం తెలిసిందే. ఇక మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆగడు'. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లారు మహేష్. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ముంబై తర్వాత కేరళ షెడ్యూలు వెళ్లనున్నారు. ముంబై షెడ్యూలు 15 రోజులు పాటు జరగనుంది. కేరళలలో కొన్ని కీలకమైన లవ్ సీన్స్ తీయనున్నారని సమాచారం. అక్కడ అందమైన లొకేషన్స్ లో ఈ సీన్స్ ప్లాన్ చేసారని సమాచారం.

Mega Counter to Mahesh Babu

కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ కు మహేష్ బాబు చాలా సంతోషంగా ఉన్నారు. 14 రీల్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమన్‌ స్వరాలందిస్తున్నారు.

'ఆగడు' టీజర్‌ లో మహేష్‌ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్‌ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్‌ మొత్తం హుషారుగా సాగిపోయింది.

పంచ్‌ డైలాగు లేకపోతే.. టీజర్‌, ట్రైలర్‌ పూర్తవడం లేదు. ఆఖరి పంచ్‌ హీరోదైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని సినీ జనాలకు అర్థమయ్యింది. అందుకే పంచ్‌లు పేలుతున్నాయి. అయితే మహేష్‌బాబు మాత్రం పంచ్‌లపైనే పంచ్‌ వేసేశాడు. 'ఆగడు' టీజర్‌లో. మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా కథానాయిక. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

English summary
Makers of 'Aagadu' to theatres either on September 19th or 26th. However, Both Ram Charan and Varun Tej have also been aiming Dussehra release slot
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu