Mirai Day 1 Collections: మిరాయ్‌కి షాకింగ్ కలెక్షన్లు.. తేజా సజ్జా మూవీకి ఎన్ని కోట్లంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మిరాయ్. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరోలు తేజా సజ్జా, మంచు మనోజ్, శ్రీయ సరన్ నటించిన ఈ చిత్రం పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ చిత్రంలో సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ తొలిసారి తల్లి పాత్రలో, రితీక నాయక్ హీరోయిన్‌గా నటించారు. జగపతి బాబు, జయరాం, దర్శకులు తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 12వ తేదీన పాన్ ఇండియామూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.
మిరాయ్ సినిమా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు మ్యూజిక్ గౌరా హరి, సినిమాటోగ్రఫి కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్స్ మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల వ్యవహరించారు. ప్రోమోలు, ట్రైలర్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచడంతో అడ్వాన్స్ బుకింగ్ కూడా చివరి నిమిషంలో ఊపందుకొన్నది. ఇక ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..

ఎపిక్ సోషియో ఫాంటసీ, ఇతిహాసాలు, పురాణాల కీలక అంశాలుగా రూపొందిన మిరాయి చిత్రంలో భారీగా యాక్షన్ సీన్లు, వీఎఫ్ఎక్స్ వర్క్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అలాగే టాప్ స్టార్ కాస్ట్, టెక్నిషియన్స్ కూడా పనిచేయడం, అలాగే రాజీ లేకుండా ఖర్చు చేయడంతో బడ్జెట్ కూడా భారీగానే అయింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో టాప్ క్లాస్ టెక్నికాలిటీస్‌తో, రిచ్‌గా నిర్మించారు.
మిరాయ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలకు, నైజాం 7 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 2.5 కోట్లు, కేరళ రైట్స్ 50 లక్షల రూపాయలు, హిందీ రైట్స్ 10 కోట్ల రూపాయల మేర వాల్యూ కట్టినట్టు సమాచారం. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహర్, కేరళలో గోకుళం పిక్చర్స్, కర్ణాటకలో హోంబలే, తమిళంలో ఏజీఎస్ రిలీజ్ చేస్తుండటం తెలిసిందే. ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమాను శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా అమెరికా రైట్స్ సుమారుగా 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్లతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకొన్నది. దాంతో తొలి రోజు భారీగా ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఈ సినిమా క్రేజ్ ఎంతలా పెరిగిందంటే.. గంటకు 15 వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. దాంతో ఈ సినిమా ఉదయం ఆటలకు 55 శాతం, మధ్యాహ్నం ఆటలకు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో గ్రాండ్ కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఇక సినిమా ఓవర్సీస్‌లో మంచి స్పందన రాబడుతున్నది. అమెరికాలో 400K డాలర్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోను, కర్నాటకలోను పాజిటివ్ టాక్ నెలకొని ఉంది. దాంతో ఈ సినిమా తొలి రోజు 12 నుంచి 15 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. మౌత్ టాక్ పాజిటివ్‌గా స్ప్రెడ్ అయితే ఇంకా వసూళ్లు పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











