Mirai Day 2 Collections: వసూళ్ల వేటలో మిరాయ్.. 2వ రోజు తేజ సజ్జా మూవీకి ఎన్ని కోట్లంటే?

బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు తేజ సజ్జా. హనుమాన్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ నటించిన చిత్రం మిరాయ్. సూపర్ మెన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఎన్నో హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

మిరాయ్‌లో ఒకప్పటి అందాల నటి శ్రీయ సరన్ తొలిసారి తల్లి పాత్రలో, రితీక నాయక్ హీరోయిన్‌గా నటించారు. మంచు మనోజ్ ప్రతినాయక పాత్ర పోషించారు. జగపతి బాబు, జయరాం, దర్శకులు తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 12వ తేదీన పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది.

Mirai Day 2 Expected Box Office Collections Worldwide Teja Sajja Movie performed well in the GBOC

మిరాయ్ చిత్రానికి గౌరా హరి సంగీత దర్శకత్వం వహించారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌తో పాటు సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్స్ మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మిరాయ్ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, రెండో రోజు తేజ సజ్జా మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

మిరాయ్ బడ్జెట్ ఎంత?
ఇతిహాసాలు, పురాణాలు కలయికగా సోషియో ఫాంటసి చిత్రంగా రూపొందిన మిరాయిలో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌లకు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు. టాప్ స్టార్లు నటించడంతో పాటు టెక్నిషియన్స్ కూడా పనిచేయడం, నిర్మాణ విలువలకు ఎక్కడా రాజీ పడకపోవడంతో మిరాయ్‌కి భారీ బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం మిరాయ్ మూవీని సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించినట్లుగా తెలుస్తోంది.

మిరాయ్ ప్రీ రిలీజ్ బిజినెస్
తేజ సజ్జా ట్రాక్ రికార్డ్, టీజర్, ట్రైలర్ల కారణంగా మిరాయ్ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. మిరాయ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలకు, నైజాం 7 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 2.5 కోట్లు, కేరళ రైట్స్ 50 లక్షల రూపాయలు, హిందీ రైట్స్ 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. థియేట్రికల్, ఆడియో, శాటిలైట్, ఓటీటీ రైట్స్ కింద మొత్తంగా మిరాయ్ చిత్రానికి 85 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 32 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 64 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని వాల్యూ నిర్దేశించారు.

మిరాయ్ తొలిరోజు వసూళ్లు
మిరాయ్ తొలిరోజు ఇండియా వైడ్‌గా 15 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 11 కోట్ల రూపాయలు, హిందీలో 2 కోట్ల రూపాయలు, తమిళంలో 70 లక్షల రూపాయలు, కన్నడంలో 40 లక్షల రూపాయాలు, మలయాళంలో 20 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 40 లక్షల రూపాయలు రాబట్టింది. ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే దుమ్ములేపిన ఈ చిత్రం నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, మిడిల్ ఈస్ట్ తదితర ఏరియాలలో కలిపి మొత్తంగా ఓవర్సీస్‌లో తొలి రోజు 12 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. దాంతో ఇండియాలో వచ్చిన కలెక్షన్స్ + ఓవర్సీస్ కలిపి మిరాయ్ వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే 27 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది.

మిరాయ్ రెండో రోజు వసూళ్లు
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. శనివారం నుంచి వీకెండ్ మొదలు కావడంతో మిరాయ్‌కి బుకింగ్స్ బాగా జరుగుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. రెండో రోజు సాయంత్రం 5 గంటల వరకు హిందీ వెర్షన్‌లో 15 శాతం, తెలుగు వెర్షన్‌లో 72 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ నివేదించింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల రూపాయలు, తమిళంలో 50 లక్షల రూపాయలు, కన్నడంలో కోటి రూపాయలు, మలయాళం + రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 22 కోట్ల రూపాయలు రాబడుతుందని అంటున్నారు. మొత్తంగా రెండ్రోజుల్లోనే 50 కోట్ల రూపాయల క్లబ్‌లో మిరాయ్ చేరుతుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X