Mirai Day 3 Collections: కుమ్మిపడేసిన తేజ సజ్జా.. 100 కోట్లకు చేరువగా మిరాయ్, 3వ రోజు ఎంతంటే?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన చిత్రం మిరాయ్. తేజ సజ్జా, రితికా నాయక్ హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీయ శరణ్, మంచు మనోజ్, జగపతి బాబు, జయరాం, తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 12వ తేదీన పాన్ ఇండియా రేంజ్ మూవీగా రిలీజైంది. మిరాయ్ చిత్రానికి గౌరా హరి సంగీత దర్శకత్వం వహించగా.. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌తో పాటు సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్స్ మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మిరాయ్ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, మూడో రోజు తేజ సజ్జా మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..
మిరాయ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ ఇతర ప్రచార కార్యక్రమాలతో కలిపి మిరాయ్ చిత్రానికి 65 కోట్ల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఎక్కడా తగ్గకుండా నిర్మాత విశ్వప్రసాద్ ఖర్చు చేశారు. గతేడాది వరుస ఫ్లాపులతో ఉన్నప్పటికీ మిరాయ్‌పై నమ్మకం ఉంచిన ఆయన రిస్క్ చేశారని ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.

మిరాయ్ ప్రీ రిలీజ్ బిజినెస్
టీజర్, ట్రైలర్ల కారణంగా మిరాయ్ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. మిరాయ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలకు, నైజాం 7 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 2.5 కోట్లు, కేరళ రైట్స్ 50 లక్షల రూపాయలు, హిందీ రైట్స్ 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. థియేట్రికల్, ఆడియో, శాటిలైట్, ఓటీటీ రైట్స్ కింద మొత్తంగా మిరాయ్ చిత్రానికి 85 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 32 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 64 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని వాల్యూ నిర్దేశించారు.
మిరాయ్ రెండు రోజుల వసూళ్లు
ఇండియా వైడ్ మిరాయ్ వసూళ్లు పరిశీలిస్తే.. తొలి రోజు 14 కోట్ల రూపాయలు, రెండో రోజున 17 కోట్ల రూపాయలు చొప్పున రెండ్రోజుల్లో ఇండియాలో 24 కోట్ల రూపాయల నెట్, 32 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా మిరాయ్ చిత్రం 55.6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక ఓవర్సీస్‌లో మిరాయ్ చిత్రం దుమ్మురేపుతోంది. తేజ సజ్జా చిత్రం ఓవర్సీస్‌లో 20 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో మిరాయ్ వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో మిరాయ్ తొలి రోజున 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో మిరాయ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తెలుగులో 25 కోట్ల రూపాయలు, హిందీలో 5 కోట్ల రూపాయలు, తమిళనాడులో కోటి రూపాయలు, కన్నడలో 50 లక్షల రూపాయలు, మలయాళం + రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు చొప్పున కలెక్ట్ చేసింది.
మిరాయ్ మూడో రోజు వసూళ్లు
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో మిరాయ్ దూసుకెళ్తోంది. మూడో రోజు ఆదివారం కుటుంబ ప్రేక్షకుల నుంచి తేజ సజ్జా మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఆదివారం సాయంత్రం 3 గంటల వరకు హిందీ వెర్షన్‌లో 15 శాతం, తెలుగులో 68 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో రోజు తెలుగులో 10 కోట్ల రూపాయలు, హిందీలో 4 కోట్ల రూపాయలు, తమిళంలో 50 రూపాయలు, కన్నడ+ మలయాళం+ రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయలు చొప్పున 20 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో మూడు రోజుల్లో మిరాయ్ చిత్రం వరల్డ్ వైడ్‌గా 75 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











