Mirai Day 6 Collections: మిరాయ్ బాక్సాఫీస్ జోరు.. తేజా సజ్జా మూవీకి 6వ రోజు ఎన్ని కోట్లంటే?

తెలుగు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుస్థాయిలో వసూళ్లను రాబడుతున్నది. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో వరుస వైఫల్యాలు చోటు చేసుకొన్న నేపథ్యంలో మిరాయ్ సినిమాకు భారీగా కలెక్షన్లు రావడం ఊరటగా మారింది. తేజా సజ్జా హీరోగా రితిక నాయక్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీన గ్రాండ్‌గా రిలీజై బాక్సాఫీస వద్ద భారీగా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

సామ్రాట్ అశోక చక్రవర్తి కాలం నాటి కథతో ఎపిక్ సోషియో ఫాంటసీగా, ఇతిహాసాలు, పురాణాల కీలక అంశాలుగా రూపొందిన మిరాయి చిత్రంలో భారీగా యాక్షన్ సీన్లు, వీఎఫ్ఎక్స్ వర్క్‌తో గ్రాండ్‌గా నిర్మించారు. అలాగే టాప్ స్టార్ కాస్ట్, టెక్నిషియన్స్ కూడా పనిచేయడం, అలాగే రాజీ లేకుండా ఖర్చు చేయడంతో బడ్జెట్ కూడా భారీగానే అయింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో టాప్ క్లాస్ టెక్నికాలిటీస్‌తో, రిచ్‌గా నిర్మించారు.

Mirai Day 6 Expected Box Office

మిరాయ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలకు, నైజాం 7 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 2.5 కోట్లు, కేరళ రైట్స్ 50 లక్షల రూపాయలు, హిందీ రైట్స్ 10 కోట్ల రూపాయల మేర వాల్యూ కట్టినట్టు సమాచారం. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహర్, కేరళలో గోకుళం పిక్చర్స్, కర్ణాటకలో హోంబలే, తమిళంలో ఏజీఎస్ రిలీజ్ చేస్తుండటం తెలిసిందే. ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమాను శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా అమెరికా రైట్స్ సుమారుగా 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తెలుగు రాష్ట్రాల్లో మిరాయ్ సినిమా విషయానికి వస్తే.. తొలి రోజు 8.5 కోట్ల రూపాయలు వసూలు చేేసింది. ఆ తర్వాత నిలకడగా కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. రెండో రోజు 8.25 కోట్లు, మూడో రోజు 7.75 కోట్లు, నాలుగో రోజు 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక 5వ రోజు 2.75 కోట్ల రూపాయలతో సరిపెట్టుకొన్నది. దాంతో 30.50 కోట్ల రూపాయల నెట్, 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో నైజాం, ఆంధ్రాలో వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో 16 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3.75 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.25 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.25 కోట్లు, గుంటూరులో 1.9 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.8 కోట్లు, నెల్లూరులో 90 లక్షల రూపాయలు వసూలు చేసింది.

మిరాయ్ చిత్రం కన్నడలో 6 కోట్ల రూపాయలు, తమిళంలో 1.5 కోట్ల రూపాయలు, కేరళలో 50 లక్షలు, హిందీలో 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 2 మిలియన్లు అంటే భారతీయ కరెన్సీలో 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరింది అని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.

ఇక 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఆరో రోజు వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజుతో పోల్చుకొంటే.. తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈ చిత్రం 2 నుంచి 2.5 కోట్ల రూపాయల మధ్య కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 105 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసే ఛాన్స్ ఉంది అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X