Mirai Day 7 Collections: మిరాయ్ కలెక్షన్స్‌పై ఊహించని దెబ్బ.. తేజా సజ్జా మూవీకి 7వ రోజు ఎన్ని కోట్లంటే?

తేజ సజ్జా, రితికా నాయక్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మిరాయ్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాలో శ్రీయ శరణ్, మంచు మనోజ్, జగపతి బాబు, జయరాం, తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సెప్టెంబర్ 12వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా మిరాయ్ రిలీజైంది. గౌరా హరి మ్యూజిక్ డైరెక్షన్ చేయగా.. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్‌తో పాటు సినిమాటోగ్రఫి బాధ్యతలు నిర్వర్తించారు. ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్స్ మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల వ్యవహరించారు. ఈ నేపథ్యంలో మిరాయ్ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 7వ రోజు తేజ సజ్జా మూవీ ఎన్ని కోట్లు రాబట్టిందో పరిశీలిస్తే..

Mirai Day 7 Expected Box Office Collections Worldwide Teja Sajja Movie maintained a decent hold

మిరాయ్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ ఇతర ప్రచార కార్యక్రమాలతో కలిపి మిరాయ్ చిత్రానికి 65 కోట్ల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక మిరాయ్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 8 కోట్ల రూపాయలకు, నైజాం 7 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 2 కోట్ల రూపాయలు, తమిళనాడు రైట్స్ 2.5 కోట్లు, కేరళ రైట్స్ 50 లక్షల రూపాయలు, హిందీ రైట్స్ 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. థియేట్రికల్, ఆడియో, శాటిలైట్, ఓటీటీ రైట్స్ కింద మొత్తంగా మిరాయ్ చిత్రానికి 85 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 32 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 64 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని వాల్యూ నిర్దేశించారు.

మిరాయ్ 6 రోజుల వసూళ్లు
ఇండియా వైడ్ మిరాయ్ వసూళ్లు పరిశీలిస్తే.. తొలి రోజు 14 కోట్ల రూపాయలు, రెండో రోజున 17 కోట్ల రూపాయలు, మూడో రోజున 17 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 7 కోట్ల రూపాయలు, ఐదో రోజున 6.50 కోట్ల రూపాయలు, ఆరో రోజున 5 కోట్ల రూపాయలు చొప్పున ఆరు జుల్లో ఇండియాలో 62 కోట్ల రూపాయల నెట్, 73 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా మిరాయ్ చిత్రం 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లుగా చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక ఓవర్సీస్‌లో మిరాయ్ చిత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు సాధిస్తోంది.. తేజ సజ్జా చిత్రం ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు దాదాపు 25 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో మిరాయ్ వసూళ్లు
తెలుగు రాష్ట్రాల్లో మిరాయ్ తొలి రోజున 13 కోట్ల రూపాయలు, రెండో రోజున 12 కోట్ల రూపాయలు, మూడవ రోజు 13 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 5.50 కోట్ల రూపాయలు, ఐదో రోజున 5 కోట్ల రూపాయలు, ఆరవ రోజున 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా మిరాయ్ వసూళ్లను పరిశీలిస్తే.. నైజాంలో 17 కోట రూపాయలు, సీడెడ్‌లో 4 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 2.30 కోట్ల రూపాయలు, వెస్ట్ గోదావరిలో 1.50 కోట్ల రూపాయలు, గుంటూరులో 2 కోట్ల రూపాయలు, కృష్ణాలో 2 కోట్ల రూపాయలు, నెల్లురులో కోటి రూపాయలు చొప్పున ఆరు రోజుల్లో మిరాయ్ మూవీకి తెలుగులో 54 కోట్ల రూపాయల గ్రాస్, 33 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

ఇండియాలోని ఇతర ప్రాంతాల్లో మిరాయ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తెలుగులో 54 కోట్ల రూపాయలు, హిందీలో 14 కోట్ల రూపాయలు, తమిళనాడులో 3 కోట్ల రూపాయలు, కన్నడలో 2 కోట్ల రూపాయలు, మలయాళం + రెస్టాఫ్ ఇండియాలో 75 లక్షల రూపాయలు చొప్పున కలెక్ట్ చేసింది.

మిరాయ్ 7వ రోజు వసూళ్లు
సోమవారం నుంచి వర్కింగ్ డే టెస్ట్‌లోనూ సత్తా చాటి తేజ సజ్జా మూవీ వసూళ్లు రాను రాను తగ్గిపోతున్నాయి. 7వ రోజైన గురువారం మిరాయ్‌కి సాయంత్రం 5 గంటల వరకు హిందీ వెర్షన్‌లో 8 శాతం, తెలుగు వెర్షన్‌లో 17 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ తెలిపింది. 7వ రోజు వరల్డ్ వైడ్‌గా మిరాయ్ చిత్రానికి 3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో కలిపి మొత్తంగా 7 రోజుల వరకు మిరాయ్‌కి 110 కోట్ల రూపాయలు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X