Mirai Day 9 Box Office: వీకెండ్ లో కనిపించని మిరాయ్ జోష్.. 9వ రోజు వసూళ్ళు ఎన్ని కోట్లంటే?

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో తేజా సజ్జా నటించిన లేటెస్ట్ సూపర్ హీరో ఫిల్మ్ మిరాయ్. ఈ చిత్రం సెప్టెంబర్ 12న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించడం విశేషం. టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంటోంది. ఈ క్రమంలో సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? 9వ రోజు వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లు వసూలైందనే వివరాల్లోకి వెళితే..

మిరాయ్ మూవీ బడ్జెట్ ఎంత?
ఈ సైంటిఫిక్ యాక్షన్ మూవీలో తేజా సజ్జా, రితికా నాయక్ జంటగా నటించగా, శ్రీయ శరణ్, మంచు మనోజ్, జగపతి బాబు, జయరాం, తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. గౌరా హరి మ్యూజిక్ అందించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫి బాధ్యతలు చూశారు. ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, మణిబాబు కరణం డైలాగ్స్ అందించారు. ఇలా నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని రూ.65 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడించారు.

Mirai Day 9 Expected Box Office Collections Worldwide

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
మిరాయ్ థియేట్రికల్ రైట్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా నుంచి రూ.8 కోట్లు, నైజాం రూ.7 కోట్లు, సీడెడ్‌లో రూ.3 కోట్లు, కర్ణాటకలో రూ.2 కోట్లు, తమిళనాడులో రూ.2.5 కోట్లు, కేరళలో రూ.50 లక్షలు, హిందీ రైట్స్ ద్వారా రూ.10 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ ద్వారా రూ.5 కోట్లు, ఇక నాన్ థియేట్రికల్ రైట్ కూడా కలుపుకొని రూ.85 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

బ్రేక్ ఈవెన్ టార్గెట్?
మిరాయ్ చిత్రానికి రిలీజ్ కు ముందే మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ ఆధారంగా ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా రూ.32 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.64 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు.

మిరాయ్ 8 రోజుల వసూళ్లు..
ఓపెనింగ్ డే రూ.13 కోట్లు, 2వ రోజు రూ.15 కోట్లు, 3వ రోజు రూ.16.6 కోట్లు, 4వ రోజు రూ.6.4 కోట్లు, 5వ రోజు రూ.6 కోట్లు, 6వ రోజు రూ.4.75 కోట్లు, 7వ రోజు రూ.3.75 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఇక వారం రోజుల్లో ఈ చిత్రం రూ.65.1 కోట్లు వసూల్ చేసిందని సాక్ నిక్ తెలిపింది. ఇక 8వ రోజు రూ.2.75 కోట్ల ఇండియా నెట్ కలెక్ట్ చేసింది.

9వ రోజు కలెక్షన్..
సెప్టెంబర్ 20న శనివారం 9వ రోజు రూ.2.04 కోట్ల వసూళ్లను అందుకుంది. ఇది కేవలం మార్నింగ్ + ఆఫ్టర్ నూన్ షో ద్వారా మాత్రమే కలెక్ట్ చేసిన వసూళ్లు కావడం గమనార్హం. ఇక మిగిలిన ఈవెనింగ్ షూస్, నైట్ షోస్ కలుపుకొని రూ.4 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మొదటి వీకెండ్ లో శుక్ర, శని, ఆదివారం కలిసి రూ.45 కోట్ల వరకు వసూల్ చేసింది. కానీ 2వ వీకెండ్ లో ఆ జోరు కనిపించలేదు. కేవలం రూ.10 కోట్లలోపే వసూల్ చేయనుందని అంచనా వేస్తున్నారు.

వరల్డ్ వైడ్ కలెక్షన్లు..
తెలుగు స్టేట్స్ లో రూ.53 కోట్లు, హిందీలో రూ.13.5 కోట్లు, తమిళంలో రూ.75 లక్షలు, కన్నడలో రూ.40 లక్షలు, మలయాళంలో రూ.20 కోట్లు వసూల్ చేసిందని సాక్ నిక్ గణంకాలు తెలుపుతున్నాయి. ఇక ఇండియా నెట్ రూ.68 కోట్లకు చేరుకుందని, ఇండియా రూ.80 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ రూ.25.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియా గ్రాస్ + ఓవర్సీస్ కలుపుకొని రూ.105 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందని సాక్ నిక్ బాక్సాఫీస్ రిపోర్ట్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X