Mirai USA Advance Booking Collections: యూఎస్‌లో మిరాయ్ కలెక్షన్ల ధమాకా.. తేజా సజ్జా జైత్రయాత్ర మొదలు!

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన చిత్రం మిరాయ్. పాపులర్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరోలు తేజా సజ్జా, మంచు మనోజ్, శ్రీయ సరన్ నటించిన ఈ చిత్రం పురాణాల ఆధారంగా సోషల్ ఫాంటసీ చిత్రానికి కృతి ప్రసాద్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 12వ తేదీన పాన్ ఇండియామూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర విశేషాలు, బడ్జెట్, అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మిరాయ్ సినిమా విషయానికి వస్తే.. సీనియర్ స్టార్ హీరోయిన్ శ్రీయ సరన్ తొలిసారి తల్లి పాత్రలో నటిస్తున్నారు. అఈ సినిమాకు మ్యూజిక్ గౌరా హరి, సినిమాటోగ్రఫి కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్, డైలాగ్స్ మణిబాబు కరణం, ప్రొడక్షన్ డిజైనర్‌గా శ్రీ నాగేంద్ర తంగల వ్యవహరిస్తున్నారు. ప్రోమోలు, ట్రైలర్‌ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దాంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను రెండు వారాల ముందే అమెరికాలో ప్రారంభించారు.

Mirai USA Advance Booking Collections

అమెరికాలోని ప్రతిష్టాత్మక చైన్ థియేటర్‌ సినీమార్క్‌లో ఈ సినిమా కోసం భారీగా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. డల్లాస్, లింకన్, వెస్ట్ ప్లానో, నార్త్ మెక్‌కినీ తదితర ప్రాంతాల్లో 4 నుంచి 9 షోల స్క్రీనింగ్‌కు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. అమెరికాలోని సుమారు 98 లోకేషన్లలో 282 షోల కోసం భారీగా ప్రీ సేల్స్‌ ద్వారా టికెట్ల అమ్మకాలను అందుబాటులోకి తెచ్చారు. మిరాయ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మంచి స్పందన వ్యక్తం కావడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏమిటో తెలియజెప్పింది.

నార్త్ అమెరికాలో మిరాయ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ సానుకూలంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించి సుమారుగా 3 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ అమ్మకాల ద్వారా సుమారుగా 50 వేల డాలర్లు అంటే 44 లక్షలు రూపాయలు వసూలైంది. ఈ వారం ఇంకా భారీగా వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది. రిలీజ్ వరకు 1 మిలియన్ డాలర్లు కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక మిరాయ్ సినిమాకు సంబంధించి నార్త్ అమెరికాలో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. ఈ సినిమా భారీ క్రేజ్ ఉండటంతో అమెరికా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 4.5 కోట్ల రూపాయల మేర జరిగింది. అంటే సుమారుగా 500K డాలర్ల మేర రైట్స్ అమ్మకాలు జరిగాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 1 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 9 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తేజా సజ్జా ఇటీవల నటించిన హనుమాన్ చిత్రం నార్త్ అమెరికాలో భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు భారీగానే ఉన్నాయి. కాబట్టి హనుమాన్ ఇమేజ్‌తోను, అలాగే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X