Mithra Mandali Day 1 Collections: మిత్రమండలి బాక్సాఫీస్ కలెక్షన్స్... ప్రియదర్శి మూవీకి ఎన్ని కోట్లంటే?

కమెడియన్‌గానే కాకుండా, నటుడిగానూ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు ప్రియదర్శి పులికొండ. ఆయన లీడ్ రోల్‌లో నటించిన చిత్రం మిత్రమండలి. ప్రముఖ నిర్మాత బన్నీ వాసుకు చెందిన బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మించారు. నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మిత్రమండలి సినిమాకు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు.

సోమరాజు పెన్మెత్స సహ నిర్మాతగా... రాజీవ్ కుమార్ రామ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించగా... సిద్దార్థ్ ఎస్టే సినిమాటోగ్రఫి, పవన్ కల్యాణ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తించారు. అక్టోబర్ 16న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో మిత్రమండలి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? తొలి రోజు ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే?

Mithra Mandali Day 1 Expected Box Office Collections Worldwide Priyadarshi s Movie good start at GBOC

మిత్రమండలి బడ్జెట్ ఎంత?
మిత్రమండలి చిత్రానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి మిత్రమండలి సినిమాకు దాదాపు 5 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. నిర్మాణ విలువల కోసం నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాను నిర్మించారు.

మిత్రమండలి ప్రీ రిలీజ్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టీజర్ల, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలో మిత్రమండలి చిత్రంపై టాలీవుడ్‌లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా బాగానే జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తొలుత థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే... ఈ సినిమాను నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు. ఇక డిజిటల్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్‌తో మిత్రమండలి ఎప్పుడో సేఫ్ జోన్‌లోకి వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు సొంతం చేసుకుంది. ఈ రెండింటి విలువ 9.50 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. థియేట్రికల్ బిజినెస్ పరంగా మిత్రమండలి ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

మిత్రమండలి కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో మిత్రమండలికి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ సినిమా 14 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. అప్పటి వరకు హైదరాబాద్‌లో 242, బెంగళూరులో 106, విజయవాడలో 65, విశాఖలో 83 షోలు ప్రదర్శితమైనట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ షో, సెకండ్ షోల నాటికి బుకింగ్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో ఈ సినిమా తొలి రోజున తెలుగు రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి 2 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నాయి. మరి ప్రియదర్శి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X