Mithra Mandali Business: మిత్రమండలి ప్రీ రిలీజ్ బిజినెస్... ప్రియదర్శి మూవీ లాభాల్లోకి రావాలంటే?

కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగానూ సత్తా చాటుతున్నారు ప్రియదర్శి. మల్లేశం, జాతిరత్నాలు, బలగం, కోర్ట్ తదితర చిత్రాలతో తనలోని నటుడిని పరిచయం చేశారు. సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ దూసుకెళ్తున్నారు ప్రియదర్శి. తాజాగా ఆయన నటించిన మూవీ మిత్రమండలి. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మిత్రమండలి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ప్రియదర్శి మూవీ లాభాల్లోకి రావాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో చూస్తే...

మిత్రమండలి తారాగణం
ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా విజయేందర్ రెడ్డి తీగల ఈ మిత్రమండలి సినిమాను నిర్మించారు. సోమరాజు పెన్మెత్స సహ నిర్మాతగా... రాజీవ్ కుమార్ రామ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిత్రమండలి సినిమాకు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓఐ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వెన్నెల కిషోర్, సత్య, వీటీవీ గణేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజిక్, సిద్దార్థ్ ఎస్టే సినిమాటోగ్రఫి, పవన్ కల్యాణ్ ఎడిటర్‌గా పనిచేశారు.

Mithra Mandali Theatrical Business Priyadarshi Movie Budget and Breakeven target Details

నలుగురు మిత్రుల కథ
ఇది ఓ వూళ్లో జరిగే నలుగురు మిత్రుల కథగా తెలుస్తోంది. దీనికి లవ్ స్టోరీని జత చేసి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు మిత్రమండలిపై అంచనాలను పెంచేశాయి. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయగా... మిత్రమండలికి దాదాపు 148 నిమిషాల నిడివి ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు, సంభాషణలను మార్చాలని సెన్సార్ బోర్డ్ సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

మిత్రమండలి బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్.. ప్రమోషనల్ కార్యక్రమాలతో మిత్రమండలి సినిమాకు దాదాపు 5 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఆంధ్రా, నైజాం, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ కలిపి 4 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో ప్రియదర్శి మూవీ లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 5 కోట్ల రూపాయల షేర్... 10 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలని ట్రేడ్ పండితులు వాల్యూ కట్టారు.

భారీ వసూళ్లతో ప్రియదర్శి సంచలనం
ఇకపోతే.. ప్రియదర్శి గత సినిమా కోర్ట్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన మూవీ కోర్ట్. 10 కోట్ల రూపాయల వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, సాయికుమార్, శివాజీ, హర్షవర్థన్, రోహిణి, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విషికా కీర్తి, శ్రీదేవి అపాళ్ల తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా.. విజయ్ బుల్గానియన్ సంగీత సారథ్యం వహించారు. మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా కోర్ట్ చిత్రం విడుదలైంది. ఈ సినిమా పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఇండియాలో 39.35 కోట్ల రూపాయల నెట్, 45.8 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో వచ్చిన 10.2 కోట్ల కలెక్షన్స్‌తో కలిపి కోర్ట్ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా 56 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిక్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X