»   » ‘ఎంఎల్ఏ’ మూవీ ఫస్ట్‌డే ఏపీ-తెలంగాణ కలెక్షన్ రిపోర్ట్!

‘ఎంఎల్ఏ’ మూవీ ఫస్ట్‌డే ఏపీ-తెలంగాణ కలెక్షన్ రిపోర్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
MLA, Needi Naadi Oke Katha, Rajaratha Premiere Shows Collections

నందమూరి కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన 'ఎంఎల్ఏ' మూవీ బాక్సాఫీసు వద్ద తొలి రోజు మంచి ఫలితాలు సాధించింది. దర్శకుడు ఉపేంద్ర మాధవ్ కమర్షియల్ వ్యాల్యూస్‌తో పాటు సందేశం, వినోదం కలగలిపి సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

బ్లూ ప్లానెట్ ఎంటర్టెన్మెంట్స్ ఎల్ఎల్‌పి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తొలి రోజు ఏపీ, తెలంగాణ ప్రాంతంలో రూ. 5.20 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

MLA Movie First Day Collections

ఎంఎల్ఏ చిత్రాన్ని యూఎస్ఏలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు విడుదల చేశారు. నార్త్ అమెరికా వ్యాప్తంగా దాదాపు 150 థియేటర్లలో దాదాపు 200 ప్రీమియర్ షోలు గురువారం ప్రదర్శించారు. కళ్యాణ్ రామ్ కెరీర్లో అత్యధికంగా ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడ్డ సినిమా ఇదే.


ఎర్లీ ఎస్టిమేషన్స్ ప్రకారం... ఎంఎల్ఏ మూవీ ప్రీమియర్ షోల ద్వారా $43,118 వసూలు చేసింది. ఇది కేవలం 63 లొకేషన్ల నుండి అందిన వివరాలు మాత్రమే. ఫైనల్‌గా అన్ని చోట్ల కలిపి ఎంత వసూలు చేసింది అనేది తెలియాల్సి ఉంది.

English summary
Kalyanram’s latest family entertainer, MLA, released yesterday and garnered decent response from fans. As per the latest updates from the film’s production houses, MLA has collected a cool Rs 5.20 crores worldwide gross and turned out to be the biggest opener in the actor’s career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X